బిగ్ బాస్ హౌజ్ లో 7వ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తెలుగు యాంకర్ శిల్పా చక్రవర్తి సర్ ప్రైజ్ ఎంట్రీ అందరిని షాక్ అయ్యేలా చేసింది. సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్స్ ఆమె ద్వారా జరిపించిన బిగ్ బాస్ ఆ తర్వాత ఆమెను హౌజ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రప్పించాడు. ఇక హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం తన మొదటి నామినేటర్ గా శ్రీముఖిని ఎంచుకుంది శిల్పా చక్రవర్తి.


అలా వచ్చి రాగానే శ్రీముఖిని టార్గెట్ చేయడంతో హౌజ్ లో ఉన్న వారంతా షాక్ అయ్యారు. ఇన్నాళ్లు హౌజ్ లో శ్రీముఖి ఏం చేసినా బిగ్ బాస్ తో పాటుగా హోస్ట్ నాగార్జున కూడా సపోర్ట్ ఇస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలకు చెక్ పెట్టేందుకే బిగ్ బాస్ హౌజ్ లోకి శిల్పాని పంపించారట. 


ఇక యాంకర్ గా శిల్పా చక్రవర్తి శ్రీముఖి కన్నా చాలా సీనియర్ ఆమె తర్వాతనే శ్రీముఖి యాంకర్ గా వచ్చింది. తప్పకుండా సీనియర్ జూనియర్ అన్న విధంగా హౌజ్ లో ఆట సాగుతుంది. హౌజ్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్ గా ఉన్న శ్రీముఖిని కాన్ఫిడెన్స్ తగ్గించేందుకే శిల్పాని హౌజ్ లోకి పంపించారని అంటున్నారు.


ఏది ఏమైనా శిల్పా ఎంట్రీ చాలా ప్రశ్నలకు తావిస్తుంది. ఇక ఈ ఆరువారాల్లో నామినేషన్స్ లో లేని అలి రెజా కూడా నామినేషన్స్ ఫేజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఆడియెన్స్ లో అతని అగ్రెసివ్ నెస్ పై విమర్శలు వచ్చాయి. కచ్చితంగా అతనికి ఈ వారం గట్టి దెబ్బే పడేలా ఉంది. ఈ వారం సైలెంట్ గా ఉంటే మంచిదే అలా కాకుండా అలి ఈ వారం ఇంటి సభ్యులతో గొడవ పడితే మాత్రం ఇంటి నుండి బయటకు వచ్చినట్టే.   



మరింత సమాచారం తెలుసుకోండి: