ఇండ‌స్ట్రీలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రు ఊహించ‌లేరు. సినీ ఇండ‌స్ట్రీలో ఎప్ప‌టిక‌ప్పుడు విచిత్ర‌మైన‌, వింతైన క‌థ‌లు వింటూనే ఉంటాం. ఎవ‌రు ఎవ‌రి జీవితాల‌తో ఆడుకుంటారో అర్థం కాదు. ఈ జాబితాలోకి వ‌చ్చే కథే ఇది. ఓ యంగ్ డైరెక్ట‌ర్ కెరీర్ ప్రారంభంలోనే యూత్‌ను టార్గెట్ చేస్తూ  ల‌వ్ స్టోరీలో హిరోయిన్‌ను నెగ‌టివ్ రోల్‌లో చూపించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు. 


హీరోయిన్ నెగ‌టివ్ రోల్‌తో యూత్‌ను ఆక‌ర్షించాడు. గ‌త ఏడాది వ‌చ్చిన ఈ సినిమాతో ఆ ద‌ర్శ‌కుడికి సినీ ఇండ‌స్ట్రీలో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే పెద్ద పెద్ద నిర్మాణ సంస్థ‌ల నుంచి ఛాన్సులు కూడా వ‌చ్చాయి. అయితే తాను త‌ర్వాత చేయ‌బోయే క‌థ‌కు స‌రైన హీరో దొరికితేనే చేస్తాన‌ని నిశ్చ‌యించుకుని మ‌రో స్క్రిప్ట్ రెడీ చేశాడు. త‌న క‌థ‌కు స‌రిపోయే హీరో కోసం అన్వేష‌ణ ప్రారంభించాడు.

చివ‌ర‌కు మాస్ మార్కెట్‌లో మంచి ఫాలోంగ్ ఉన్న హీరోను ఖ‌రారు చేసుకున్నాడు. ఆ హీరోకు కూడా స్టోరీ న‌చ్చ‌డంతో గ్రీన్ సిగ్నెల్‌ ఇచ్చేశాడు. నిర్మాత కూడా మంచి ప్లానింగ్‌తో ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే మ‌రో రెండు నెల‌ల్లో షూటింగ్ ప్రారంభించాల్సి ఉండ‌గా ఆ హీరో ఏకంగా రూ.14 కోట్ల రెమ్యూన‌రేష‌న్ అడ‌గ‌డంతో నిర్మాత షాకై ఈ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నాడు. 


అయితే వాస్త‌వానికి గ‌త మూడు సినిమాలు విప‌రీత‌మైన డిజాస్ట‌ర్లు చెవి చూసిన ఆ హీరో ఏకంగా హై రెమ్యూన‌రేష‌న్ అడ‌గ‌డంతో పాటు క‌థ‌లో మార్పులు చేయాల‌ని డిమాండ్ చేశాడ‌ట‌. అయితే దీనికి ద‌ర్శ‌కుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఈ హీరోతో సినిమాకు పులిస్టాప్ పెట్టేశాడ‌ట‌. అయితే స‌ద‌రు హీరో ఇలాంటి కార‌ణాల‌తోనే ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను ఇబ్బంది పెడుతూ దెబ్బ తింటున్నాడ‌ని కామెంట్ చేస్తున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: