మెగాస్టార్ సైరా మూవీ అక్టోబర్ 2 వ తేదీన భారీగా రిలీజ్ కాబోతున్నది.  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  ఈఅంచనాలతో రిలీజ్ కాబోతున్న సైరా బిజినెస్ పరంగా కూడా ఇప్పటికే భారీగా జరిగినట్టు తెలుస్తోంది.  సైరా సినిమా రిలీజ్ విషయంలో మొన్నటి వరకు కొన్ని డౌట్స్ ఉన్నాయి.  కానీ, ఆ డౌట్స్ ను పక్కన పెట్టి అనుకున్నట్టుగానే సినిమా అక్టోబర్ 2 వ తేదీన రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.  


సైరా సినిమా వస్తున్నది కాబట్టి ఆరోజున మరో సినిమా రిలీజ్ కావడం లేదు.  అక్టోబర్ 2 న సింగిల్ గా సైరా వస్తున్నది.  సింగిల్ గా ఈ మూవీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.  దసరా సమయం కాబట్టి మాములుగా చాలా సినిమాలు రిలీజ్ కావాల్సి ఉన్నది.  కానీ, మెగాస్టార్ సినిమా అనే గౌరవంతో ఆ సమయానికి ఏవి రిలీజ్ కావడం లేదు.  ఇప్పుడ అసలు విషయం ఏమిటంటే.. సైరా వచ్చిన కొన్ని రోజులకు వెంకటేష్, నాగచైతన్యల వెంకిమామ రిలీజ్ కావాలని చూస్తున్నది.  


వెంకిమామ సినిమా దసరా కానుకగా రిలీజ్ చేయబోతున్నారు.  ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.  కామెడీ ఎంటెర్టైనెర్ గా సినిమా రాబోతున్నది.  ఎంటర్టైనర్ కాబట్టి బాగుందే అవకాశం ఉన్నది.  పైగా ఎఫ్2 తరువాత వెంకటేష్, మజిలీ తరువాత నాగ చైతన్యలు చేస్తున్న సినిమా కావడంతో సినిమా తప్పకుండా ఆడుతుందని నమ్మకంతో ఉన్నారు.  


ఇటు సైరా టీజర్ ఇప్పటికే ఆకట్టుకుంది.  యూట్యూబ్ లో వ్యూస్ ఒక రేంజ్ లో ఉన్నాయి.  పైగా ఇది పాన్ ఇండియన్ మూవీ.  అల్ ఇండియా స్టార్స్ నటిస్తున్నారు.  సినిమా విషయంలో ఎలాంటి రాజీపడకుండా తీశారు.  పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.  ప్రపంచంలోని టాప్ దేశాల్లో ఈ సినిమాకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ జరుగుతున్నాయి.  అక్టోబర్ 2 న సైరా వస్తున్నది.  మరి వెంకీ మామ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతున్నది తెలియాల్సి ఉన్నది.  దసరా అక్టోబర్ 8 వ తేదీ కాబట్టి ఒకరోజు ముందుగా గాని లేందంటే అదే రోజున గాని సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: