బిగ్ బాస్ సీజన్ 3 లో 7వ వారం లక్సరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా కంటెస్టంట్స్ అంతా టాస్క్ లో ఇన్వాల్వ్ అయ్యి తమ బెస్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇక హౌజ్ లో మొదటినుండి శ్రీముఖి, రాహుల్ ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు రాహుల్ తను చేసిన తప్పు వల్ల శ్రీముఖికి సారీ చెబుతూ వస్తున్నా సరే శ్రీముఖి మొదటి టార్గెట్ అతనే అవుతున్నాడు.


ఇక మంగళవారం జరిగిన దొంగాట టాస్క్ లో దొంగల జెండాని తీసుకెళ్లే క్రమంలో రాహుల్, శ్రీముఖిల మధ్య గొడవ జరిగింది. ఈగొడవలో మధ్యలో పునర్నవి కలుగ చేసుకుని రాహుల్ ఉన్నాడు కాబట్టే నువ్వు వాయిస్ రేజ్ చేస్తున్నావని అన్నది. పునర్నవి వార్సెస్ శ్రీముఖి మధ్య గొడవకు దారితీసింది.


మరోపక్క వితిక, వరుణ్ ల మధ్య కూడా టాస్క్ లో భాగంగా గొడవ జరిగింది. రాహుల్ కాలికి గాజు పెంకు కుచ్చుకోవడం వల్ల ఆటని కొద్దిసేపు ఆపారు. అయితే ఆ టైంలో వితిక దొంగల జెండాని పట్టుకునే ప్రయత్నం చేసింది. వరుణ్ దాన్ని నిరాకరించి వితిక దగ్గర నుండి బలవంతంగా ఆ జెండాని తీసుకున్నాడు. అంతేకాదు వితిక మీద సీరియస్ అయ్యాడు వరుణ్ సందేష్.  


ఇదంతా టాస్క్ లో భాగమని తెలిసినా తరచు రిపీట్ అవుతూనే ఉంది. శ్రీముఖి స్ట్రాంగ్ కంటెస్టంట్ గా కనిపిస్తున్నా హౌజ్ లో కొందరు ఎలాంటి మాటలు అన్నా లైట్ తీసుకుంటూ కొందరు సరదాగా అన్న మాటలను సీరియస్ గా తీసుకుంటుంది. ఫైనల్ గా టాస్క్ కొనసాగింపు ఈరోజు సాగగా ప్రోమోస్ లో అలి రెజా కూడా రాహుల్, రవిల మీద సీరియస్ అయినట్టు చూపించారు. మొత్తానికి ఈ టాస్క్ మరోసారి ఇంటి సభ్యుల మధ్య గొడవలకు దారి తీసిందని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: