ప్రపంచ వ్యాప్తంగా గణపతి ఉత్సవాలంటే ఎంత సంబురంగా చేసుకుంటారో అందరికీ తెలిసిందే.  చిన్నా పెద్దా అనే తేడా లేకుండా గణపతి వేడుకల్లో పాల్గొని స్వామి వారి సన్నిధిలో ఆడీ పాడీ తరిస్తారు. అయితే వినాయక చవితి దేశ విదేశాల్లో ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. దేశంలో తొలిపూజ గణపతికి చేసిన తర్వాతనే అన్ని పండుగలు మొదలవుతాయి. ఇక విఘ్న వినాయకుడి పూజల్లో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు భక్తి ప్రపత్తులతో పూజలు చేస్తుంటారు. 

ముఖ్యంగా సినీ సెలబ్రెటీలు వినాయక పూజల్లో పాల్గొన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుంటారు. బాలీవుడ్ ప్రముఖులు గణేశ్ ఉత్సవాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ నేపధ్యంలో కండలవీరుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ తమ ఇంట్లో గణపతి విగ్రహాన్ని నెలకొల్పి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సల్మాన్‌ఖాన్‌ చిందేసాడు. తీన్మార్‌ స్టెప్పులతో అదరగొట్టేశాడు.

ఓ వైపు చిన్నగా వర్షం పడుతున్నా సల్మాన్‌తో పాటు ఆయన సోదరులు సోహయిల్‌ ఖాన్‌, అర్భాజ్‌ ఖాన్‌, సోదరి అర్పితాఖాన్‌తో పాటు ఫ్యామిలీ అంతా రెచ్చిపోయి మరి డాన్స్‌ చేశారు. వినాయక చవితి సంధర్భంగా సల్మాన్‌ తన ఇంట్లో వినాయకుడిని ప్రతిష్ఠించుకున్నాడు. ఆ వినాయకుడి నిమజ్ఙనం సంధర్భంగా సల్లూభాయ్‌తో పాటు టోటల్ ఫ్యామిలీ గణపతి బప్పా మోరియా అంటూ చిందేసింది. ప్రతి సంవత్సరం సల్మాన్ ఖాన్ ఇంట గణపతి దేవుడికి ఎంతో గొప్పగా పూజలు జరిపిస్తుంటారు. 

దీనికి సంబంధించిన పలు వీడియోలు వైరల్‌గా మారాయి. ఒక వీడియోలో సల్మాన్ తన మేనల్లుడిని ఎత్తుకుని వినాయక పూజ చేస్తూ కనిపిస్తున్నాడు. అదే విధంగా బాలీవుడ్ తారలు నేహా ధూపియా, అంగద్ బేడీ తదితరులు కూడా ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. గణపతి నిమజ్జన వేడుకల్లో సల్మాన్ తీన్మార్ డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: