మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా  నిర్మిస్తున్న చిత్రం సైరా నర్సింహారెడ్డి.  మెగా స్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రం అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది.  ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈచిత్రం ఓ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.  కాగా దాదాపు దేశ వ్యాప్తంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తుది దశకు చేరుకుంది.  ఇక ఇదిలా ఉంటే విడుదలకు రోజులు దగ్గర పడుతున్న  ఓవర్సీస్ లో  మాత్రం ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. దానికి కారణం లేకపోలేదు. 





ఇటీవల  ఓవర్సీస్ లో తెలుగు సినిమాలు పెద్దగా  లాభాలను తీసుకురాలేకపోయాయి. ఇక  తాజాగా విడుదలైన  సాహో కూడా అక్కడ భారీ నష్టాలను మిగిల్చడంతో అక్కడి బయ్యర్లు పెద్ద సినిమాలు  అంటే భయపడుతున్నారు.  దానికి తోడు  రామ్ చరణ్,సైరా ఓవర్సీస్ హక్కుల విషయంలో వారికీ చుక్కలు చూపెడుతున్నాడు.  మొదటగా ఈసినిమాను  25కోట్లకు అమ్మాలనుకున్నాడు.  అయితే ఎవరు ముందుకు రాకడపోవడం తో 25నుండి 20కోట్ల వరకు వచ్చాడు. అప్పటి కూడా ఎవరు ఆసక్తి  చూపకపోవడంతో  వెనక్కి తగ్గి చరణ్ ఈ చిత్రాన్ని 16కోట్లకు ఇవ్వడానికి రెడీ అయిపోయాడని  సమాచారం.  ఫార్ ఫిలిమ్స్ ఈ హక్కులను సొంతం చేసుకోనే అవకాశాలు కనిపిస్తున్నాయి.  





సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో స్వాతంత్య్ర  సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి  జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో   లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటించగా  బిగ్ బి అమితాబ్ బచ్చన్,  జగపతి బాబు  విజయ్ సేతుపతి , రవి కిషన్   ,సుధీప్, తమన్నా  ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్  మ్యూజిక్  డైరెక్ట్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న తెలుగు , హిందీ , కన్నడ , మలయాళ , తమిళ భాషల్లో విడుదలకానుంది.     

మరింత సమాచారం తెలుసుకోండి: