బాలీవుడ్ లో ఎంతో మంది మోడల్స్ హీరోయిన్స్ గా మారారు..అయితే మాజీ పోర్న్ స్టార్, ఆకట్టుకునే రూపం, హాట్ అండ్ సెక్సీ ఫిజిక్ ఉన్న సన్నీలియోన్ బాలీవుడ్లో తక్కువ సమయంలో క్లిక్ అయింది. కెనడియన్ అయిన సన్నీ లియోన్ బాలీవుడ్లో అవకాశాల కోసం తన భర్త డేనియల్ వెబర్ తో కలిసి ముంబైలో మకాం వేసింది.  2011లో బిగ్ బాస్ 5 అనే రియాల్టీ షో ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో అడుగు పెట్టిన సన్నీ లియోన్...అప్పట్లో హాట్ టాపిక్. ఆమె పోర్న్ స్టార్ కావడంతో అప్పట్లో ఆమె గురించి మీడియా చర్చ సాగింది. ఆ పరిణామాలు ఆమెకు మరింత పాపులారిటీ తెచ్చి పెట్టాయి. 


మొదట ఒకటీ రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించినా తర్వాత ఐటమ్స్ సాంగ్స్ కే పరిమితం అయ్యింది.  తెలుగు, మళియాళ భాషల్లో కూడా సన్నీలియోన్ ఆడిపాడింది. బాలీవుడ్ లో తన అందాల ఆరబోతతో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది. ఇప్పుడు తన గత చిత్రాలను మరకను చెరిపేసుకొని, సినిమాలు చేస్తున్నది.  ఫోర్న్ ప్రపంచం నుంచి బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన తర్వాత సన్నిలియోన్ లో చాలా మార్పులు వచ్చాయి. 


 నటిగానే కాకుండా ఆమె ఒక భార్యగా, పిల్లలకు తల్లి బాధ్యతలు కూడా నెరవేరుస్తుంది. ఇటీవల ఆమె తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వెకేషన్ వెళ్లింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.  తాజాగా  తానూ ఉన్న రంగం ఏదైనా కావొచ్చు.. భక్తి విషయంలో అందరూ ఒక్కటే అంటుంది. 


తాజాగా వినాయక చవితి సందర్భంవగా భర్త వెబర్, తన ముగ్గురు పిల్లలతో కలిసి ఇంట్లో ఎంతో సాంప్రదాయంగా పండగు చేసుకున్నట్లు తెలిపింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఎప్పుడు అర్థనగ్నంగా కనిపించే సన్నీలియోన్ ఇంత సాంప్రదాయంగా చూడటం నిజంగా ఆశ్చర్యం వేస్తుందంటున్నారు నెటిజన్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: