ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ సాహో, తొలిరోజు తొలి ఆట నుండి నెగటివ్ టాక్ సంపాదించి ప్రస్తుతం మెల్లగా ముందుకు సాగుతోంది. అయితే అంతక ముందు బాహుబలి రెండు భాగాలు సూపర్ డూపర్ హిట్స్ తో ప్రభాస్ రేంజ్ అమాంతం బాలీవుడ్ స్టార్ హీరోల రేంజ్ కి పెరగడం, అలానే ప్రభాస్ చివరి సినిమా బాహుబలి 2 రిలీజ్ అయి రెండేళ్లు కావడంతో, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయిలో ఏర్పడ్డాయి. కాబట్టి ఈ సినిమాకు తొలిరోజు మాత్రం సూపర్బ్ గా ఓపెనింగ్స్ రావడం జరిగిందని, అయితే ఆ తరువాత వరుసగా రెండు రోజులు ఆదివారం మరియు వినాయక చవితి పండుగ కావడంతో సినిమాకు బాగానే కలెక్షన్స్ వచ్చాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. 

ఇక నిన్నటి నుండి ఈ సినిమాకు చాలా వరకు డ్రాప్స్ కనపడుతున్నాయని, ఇక నేడు అయితే చాలాచోట్ల హెవీ డ్రాప్స్ కనపడినట్లు చెప్తున్నారు విశ్లేషకులు. నిజానికి సినిమాలో విజువల్స్ కోసమే విపరీతమైన ఖర్చు పెట్టడం, అలానే సినిమాకు కీలకమైన కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నివేశాల వంటివి సాహో లో అస్సలు లేకపోవడం అతి పెద్ద మైనస్ గా వారు చెప్తున్నారు. అందులోను, సినిమాకు వచ్చిన ప్రేక్షకుడికి సినిమాలోని గ్రాఫిక్స్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోగా, ఏదో వీడియో గేమ్ లో మాదిరిగా ఉండడం కూడా సినిమాకు కొంత మైనస్ అయిందని వారు చెప్తున్నారు. ఈ రోజు నుండి చాలా చోట్ల బాగా డ్రాప్ అయిన ఈ సినిమా పరిస్థితి, రాబోయే మరికొద్దిరోజుల్లో మరింత దారుణంగా ఉండే పరిస్థితి ఉందని అంటున్నారు. 

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కాస్త పర్వాలేదనిపించినప్పటికీ, ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమా మరింత దారుణంగా కలెక్ట్ చేస్తోందని, ఒకరకంగా అక్కడి పరిస్థితి చూస్తుంటే, చివరికి దీని పరిస్థితి అస్సామే అనే రీతిలో అక్కడి ప్రేక్షకులు సినిమాపై సెటైర్లు వేస్తున్నారని చెప్తున్నారు. ఇక మరోవైపు సాహో నిర్మాతలు చెప్తున్న కలెక్షన్లు కొంతవరకు కరెక్టే కానీ, మరికొంత మాత్రం ఫేక్ అనే విధంగా టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియక, సాధారణ ప్రేక్షకులు అయోమయానికి గురవుతున్నారు. మరి మున్ముందు సాహో పరిస్థితి ఎలా ఉంటుంది, ఓవర్ ఆల్ గా ఎంతమేర కలెక్ట్ చేస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందే......!!     


మరింత సమాచారం తెలుసుకోండి: