బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ తర్వాత హృతిక్ రోషన్ అంత గొప్ప పేరు తెచ్చుకున్నాడు. కండల వీరుడంటే..సల్మాన్ తర్వాత హృతిక్ రోషన్ అనే స్థాయికి ఎదిగాడు.  ఆ తర్వాత ఆ స్థానంలోకి జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ వచ్చాడు.  టైగర్ ష్రాఫ్ కేవలం నటుడిగానే కాకుండా జిమ్నాస్టిక్, మార్షల్ ఆర్ట్స్ లో ఎన్నో ప్రయోగాలు చేస్తూ అందరి మన్ననలు పొందాడు.  టైగర్ ష్రాఫ్ రియల్ ఫైట్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 2014లో 'హీరోపంతి' సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమయ్యారు టైగర్ ష్రాఫ్.

ఆ తర్వాత 'బాఘి', 'బాఘి 2' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.  ప్రస్తుతం హృతిక్, టైగర్ ష్రాఫ్ ‘వార్ ’మూవీలో నటిస్తున్నారు.  ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లో అక్టోబర్ 2 న రిలీజ్ కాబోతుంది. ఇదే సమయంలో బాలీవుడ్ లో మెగాస్టార్ నటించిన ‘సైరా’ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. తాజాగా ‘వార్ ’మూవీ ప్రమోషన్ బిజీలో ఇద్దరు హీరోలు ఉన్నారు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాకీ ష్రాఫ్ మాట్లాడుతూ.. తాము ఒకానొక సమయంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పారు.

తనకు 11 ఏళ్ల వయసులో ఆయన తల్లి అయేషా 'బూమ్' అనే సినిమాను నిర్మించారు. 2003లో వచ్చిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించగా.. కత్రినా కైఫ్ అదే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  ఈ మూవీపై అప్పట్లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయని..కాకపోతే అదే సమయంలో సినిమా రిలీజ్ కాకముందే పైరసీ భారిన పడటంతో మూవీపై దారుణమై దెబ్బ పడిందని అన్నారు. 

తాము పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాలేదని..దారుణమైన నష్టాలు భరించాల్సి వచ్చిందని ఆవేదన చెందాడు.  సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇంట్లో సామాన్లు అమ్మాల్సిన పరిస్థితి కలిగిందని. తనకు ఎంతో ఇష్టమైన సామాన్లు ఒక్కొక్కటగా మాయం కావడం..తన మంచం కూడా అమ్మేశారని, ఆ సమయంలో తాను కింద పడుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.  తర్వాత అలాంటి ప్రయోగాలు చేయకుండా తమ ఆర్థిక స్థితి బాగు చేసుకున్నామని అన్నారు  టైగర్ ష్రాఫ్.


మరింత సమాచారం తెలుసుకోండి: