తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీకి పెట్టింది పేరు.  జంధ్యాల స్కూల్ నుంచి వచ్చిన బ్రహ్మానందం తెలుగులో దాదాపుగా 1500 సినిమాలకు పైగా నటించారు.  ఎన్నో అవార్డులు అందుకున్నారు.  బ్రహ్మానందం తనదైన శైలిలో హాస్యాన్ని పండించడంలో దిట్ట.  ఎలాంటి పాత్రనైనా సరే అవలీలగా చేయగల సమర్ధుడు.  అందుకే బ్రహ్మి సినిమాలో ఉన్నాడు అంటే కామెడీకి కొదవ ఉండదు.  


మనీ వంటి సినిమాలో అయన చేసిన కామెడీ అంతాఇంతా కాదు.  ఖాన్ తో గేమ్స్ ఆడకు.. బాక్స్ బద్దలౌతుంది. అనే డైలాగ్ ఇప్పటికి మరచిపోలేము.  అలంటి బ్రహ్మి గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యాడు.  కారణం ఆరోగ్యం.  ఇటీవలే ముంబైలో గుండె ఆపరేషన్ చేయించుకున్నారు.  కొంతకాలం రెస్ట్ తీసుకున్నారు.  ఆలా రెస్ట్ తీసుకున్న తరువాత తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.  


వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాతో తిరిగి రీ ఎంట్రీ ఇస్తున్నాడు బ్రహ్మి.  బ్రహ్మి కామెడీ చూసి చాలా కాలం అయ్యింది. తెలుగులో ఎంతోమంది కామెడీ యాక్టర్స్ వస్తున్నారు.  కామెడీ సినిమాలు చేస్తున్నారు.  కానీ, బ్రహ్మి స్థానాన్ని మాత్రం ఎవరు ఆక్రమించలేదు.  కారణం బ్రహ్మి కామెడీ పవర్ అలాంటిది.  హావభావాలు టైమింగ్ అన్ని సూపర్.  బ్రహ్మి ఎంట్రీగా మన్మధుడు 2 లో చేశారు. గెస్ట్ రోల్ చేశారు.  


కాగా, వాల్మీకి సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేస్తున్నాడు.  బ్రహ్మి కోసం దర్శకుడు హరీష్ శంకర్ పంచ్ కామెడీని సిద్ధం చేశారని తెలుస్తోంది.  మరి ఆ కామెడీ ఎలా ఉంటుంది.  ఏ టైప్ కామెడీని బ్రహ్మి ఎలా పండించాడు.  రీ ఎంట్రీ మూవీలో బ్రహ్మి నటన ఎలా ఉన్నది తెలియాలంటే సెప్టెంబర్ 20 వరకు ఆగాల్సిందే.  గతంలో లాగా బ్రహ్మానందం వరసగా సినిమాలు  చేయకుండా కొన్నాళ్ళు లిమిటెడ్ సినిమా చేస్తే బాగుంటుంది .  


మరింత సమాచారం తెలుసుకోండి: