బిగ్ బాస్ లో బుధవారం జరిగిన ఎపిసోడ్ లో పెద్ద రచ్చ జరిగింది. బిగ్ బాస్ ఇచ్చిన దొంగలు దోచిన నగరం టాస్క్ వల్ల ఇంటి సభ్యులందరూ గొడవలకి దిగారు. ముఖ్యంగా ఆలీ, రాహుల్ లు కొట్టుకున్నంత పని చేశారు. ఆలీ అయితే ఎవరికి గేమ్ ఆడరాదంటూ సీరియస్ అయ్యాడు. టాస్క్ లని సీరియస్ గా తీసుకునే ఆలీ, ఇంటి సభ్యుల మీద కోప్పడ్డాడు. అయితే ఇక్కడో విషయాన్ని గమనిస్తే బిగ్ బాస్ చిన్న లాజిక్ ని మిస్సయినట్టు తెలుస్తుంది.


ఈ విషయం మీద బిగ్ బాస్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే టాస్క్ లో హింస చేయరాదు అనే నియమం ఉన్నప్పుడు ఫిజికల్ టాస్క్ లు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఫిజికల్ టాస్ ఇచ్చినపుడు కంటెస్టెంట్స్ అటు లాగడం, ఇటు లాగడం అనేది జరుగుతుంది. ఆ పెనుగులాటలో కంటెస్టెంట్స్ గాయాలు కావడం కూడా సహజమే! గాయాలు అవకుండా, అగ్రెసివ్ కాకుండా ఫిజికల్ టాస్క్ లు ఆడడం కష్టం.


అలా అనుకుంటే అసలు అలాంటి టాస్క్ లే ఇవ్వకూడదు. ఇక టాస్క్ మొత్తం పూర్తికాకముందే రద్దు చేయడం ఏంటో అర్థం కావట్లేదు. టాస్క్ ని రద్దు చేయడం ఇది రెండోసారి. టాస్క్ లో శారీరక హింస జరుగుతున్నప్పుడు బిగ్ బాస్ హెచ్చరిస్తే సరిపోయేదానికి రద్దు చేయడం బాలేదని వార్తలు వస్తున్నాయి. ప్రేక్షకుడికి ఏదైనా ఒక టీం గెలవాలని ఉంటుంది. అందుకోసమే చూస్తాడు.


కానీ సడెన్ గా టాస్క్ రద్దు చేయడం వల్ల నీరసించిపోతున్నారు. ఫిజికల్ టాస్ ఇచ్చే ముందు బిగ్ బాస్ ఇవన్నీ ఆలోచిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా బిగ్ బాస్ లాజిక్ ని మిస్సయ్యాడని తెలుస్తుంది. ఇలాంటి టాస్క్ లు ఇవ్వకుండా బాగుంటుందని, ఒకవేళ ఇచ్చినా పూర్తిగా ఆడనివ్వాలని కోరుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: