బిగ్ బాస్ సీజన్ 3 లో తాజాగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి  దొంగలు దోచిన నగరం అనే టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ టాస్క్‌లో దొంగలకు రాణిగా శిల్పా ఉండగా, దొంగలుగా రాహుల్‌, రవికృష్ణ, శివజ్యోతి, వరుణ్, పునర్నవి సందేశ్ ఉన్నారు. నగర వాసులుగా శ్రీముఖి, హిమజ, అలీ, వితికా, మహేష్‌, బాబా భాస్కర్ ఉంటారని బిగ్ బాస్ తెలిపారు. మొదటి లెవల్ మంగళవారం పూర్తి చేయగా ... మొదటి లెవెల్ లో  ఇంటి సభ్యులు వీరంగం సృష్టించారు. తిట్టుకోవడాలు, కోట్టుకోవడాలు, ప్రాపర్టీస్ డ్యామేజ్ చేయడం ఇలా విపరీతంగా ప్రయత్నాలు చేసి టాస్క్ లో విజయం సాధించడానికి చూసారు. ఇక తాజా ఎపిసోడ్ లో ఇంటి సభ్యులు రచ్చ చేశారు. 

సెకండ్ లెవల్‌లో భాగంగా రాణిని గద్దె దింపాలని చెప్పడంతో పాటు నిధిని దోచుకోవాలని బిగ్ బాస్ చెప్పారు. టాస్క్‌లో భాగంగా రంగంలోకి దిగిన ఇంటి సభ్యులు తాము సెలబ్రిటీలమన్న విషయమే మరచిపోయి వీరంగం సృష్టించారు. తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, గింజుకోవడాలు ఇలా హింసాత్మకంగా టాస్క్ చేశారు. బిగ్ బాస్ మంగళవారం రోజు వార్నింగ్ ఇచ్చినప్పటికి అవేమి పట్టించుకోని హౌజ్‌మేట్స్ బుధవారం రోజు కూడా బీభత్సం సృష్టించారు. టాస్క్ మరింత హింసాత్మకంగా మారుతున్న తరుణంలో బిగ్ బాస్ దొంగలు దోచిన నగరం టాస్క్‌ని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు చెప్పాడు.

ప్రాపర్టీస్ పాడు కాకుండా, ఎవరు గాయపడకుండా టాస్క్ ఆడమని చెప్పినప్పటికి , అవి పెడచెవిన పెట్టిన ఇంటి సభ్యులకి ఈ వారం లగ్జరీ బడ్జెట్ రద్దు చేస్తున్నట్టు తెలిపారు బిగ్ బాస్. అంతేకాక టాస్క్ ఎవరి వలన రద్దు అయిందో ఇంటి సభ్యులే నిర్ణయించి చెప్పాలని అనడంతో ఏకాభిప్రాయం ప్రకారం రాహుల్, రవికృష్ణని హౌజ్‌మేట్స్ ఎంపిక చేశారు. దీంతో వారిద్దరిని జైలులో వేసి తాళం వేయాలని కెప్టెన్ వరుణ్‌కి ఆదేశించారు బిగ్ బాస్. జైలులో ఉన్న రాహుల్‌, రవికి కాఫీ, టీ, వేరే ఫుడ్ వంటివి ఇవ్వకూడదని, బిగ్ బాస్ పంపిన జైలు ఫుడ్ మాత్రమే ఇవ్వాలని అన్నారు.

వరుణ్‌, వితికాల మధ్య విభేదాలు రాగా, వారిద్దరు ఒకర్నొకరు దూషించుకుని కొట్టుకోవడానికి సిద్ధ పడ్డారు. ఇక ఇప్పటి వరకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉన్న అలీ,రవి కూడా కొట్టుకున్నంత పని చేశారు. బిగ్ బాస్ కొట్టుకునే టాస్క్ ఇచ్చి కొట్లాడుకోకూడదు అని అభిమానులు మండిపడుతున్నారు. ఆలా అయినప్పుడు    ఇలాంటి టాస్క్‌లకి బదులు కాస్త ఎంటర్‌టైన్‌మెంట్  టాస్క్ లు ఇస్తే బాగుంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: