పవన్ కళ్యాణ్ తిరిగి ‘జనసేన’ ను జనం మధ్యకు తీసుకు వెళ్ళడానికి సాయి శక్తులా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకవైపు తన రాజకీయాలు కొనసాగిస్తూనే కనీసం ఏడాదికి ఒక సినిమా చొప్పున నటించడానికి పవన్ ఇప్పటికే తనకు సన్నిహితులైన దర్శకులతో మంతనాలు సాగిస్తున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థితులలో ‘భారతీయ జనతా పార్టీ’ పవన్ ముందు లేటెస్ట్ గా పెట్టిన ఒక ఆలోచన విషయమై పవన్ తీవ్ర స్థాయిలో ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు లేటెస్ట్ గా బిజెపి కి చెందిన ఒక కీలక నేత పవన్ ముందు ఒక సూచనను పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే 2024 లేదంటే 2023 ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా చిరంజీవిని బిజెపి అభ్యర్ధిగా ప్రకటిస్తుందని దీనికి పవన్ తన ‘జనసేన’ పార్టీని కొనసాగిస్తూనే బిజెపి కి రానున్న ఎన్నికలలో సపోర్ట్ ఇమ్మని కోరినట్లు తెలుస్తోంది. 

ఈ సూచనను పూర్తిగా పవన్ తిరస్కరించకుండా అప్పటి పరిస్థితులను బట్టి తాను ఆలోచిస్తాను అంటూ సున్నితంగా సమాధానం దాట వేసినట్లు టాక్. గత కొంతకాలంగా పవన్ చేస్తున్న ఉన్యాసాలలో బిజెపిని అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ పై తీవ్ర విమర్శలు చెయడం లేదు. దీనితో పవన్ మాటలలో వచ్చిన మార్పును పసిగట్టి ఇలాంటి ఊహాగానాలు చేస్తున్నారా అన్న సందేహాలు కూడ వస్తున్నాయి. 

వాస్తవానికి చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం సినిమాలు గురించి మాత్రమే ఆలోచనలు చేస్తున్నాడు. అయితే వచ్చేనెల విడుదల కాబోతున్న ‘సైరా’ సక్సస్ స్థాయిని బట్టి భవిష్యత్ లో చిరంజీవి రాజకీయ ఆలోచనలు మారే ఆస్కారం కనిపిస్తోంది. ఇప్పటికే తమిళనాడులో రజినీకాంత్ కోసం గేలం వేస్తున్న బిజెపి ఇప్పుడు ఆంద్రప్రదేశ్ లో చిరంజీవి కోసం పవన్ ద్వారా చేస్తున్న రాయబారాలకు ఈ మెగా బ్రదర్స్ ఇద్దరు రానున్న కాలంలో ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారు అన్నది చిరంజీవి పవన్ ల మధ్య కొనసాగే సీక్రెట్..


మరింత సమాచారం తెలుసుకోండి: