ప్రముఖ దర్శకులు  వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వం వహించి, నిర్మించిన సినిమా ‘దేవదాసు’.  ఈ మూవీతో హీరో రామ్, హీరోయిన్ ఇలియానా హీరో, హీరోయిన్లుగా వెండి తెరకు పరిచయం అయ్యారు.  మొదటి సినిమా అయినా ఎంతో సినియర్ నటుల్లా నటించి మెప్పించారు.  ఇక ఈ మూవీతో హీరో రామ్ మంచి ఎనర్జిటిక్ హీరో అనిపించుకున్నాడు. హీరోయిన్ ఇలియానా తన నడుం వొంపులతో కుర్రాళ్లకు పిచ్చెక్కించింది.  ఇలియానా గ్లామర్ చూసి దర్శక, నిర్మాతలు ఫిదా అయ్యారు.

తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కించుకుంది ఈ గోవా బ్యూటీ.  తెలుగు లో టాప్ హీరోయిన్ గా ఎదిగిన ఇలియానా ఒక్కసారే బాలీవుడ్ లోకి అడుగు పెట్టి అక్కడ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇదే సమయంలో తెలుగు లో కుర్రహీరోయిన్ల జోరు పెరిగిపోవడంతో ఇలియానా డిమాండ్ పడిపోయింది.  కనీసం ఐటమ్స్ సాంగ్స్ లో కూడా తీసుకోలేదు. ఇదే సమయంలో ఇలియానా ప్రముఖ ఫోటోగ్రాఫర్ ప్రముఖ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ప్రేమాయణం కొనసాగించింది. 

ఈ మద్య వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సినీ కెరీర్ పై ఇలియానా దృష్టి పెట్టిందట. ఇక సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలకు ప్రైవసీ అనేది బాగా తగ్గిపోయింది. అభిమానులకు టచ్ లో ఉండాలని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తమ వ్యక్తిగత విషయాలను, సినిమా విషయాలను పంచుకోవడం మొదలుపెట్టారు.  ఈ నేపథ్యంలో ఓ అభిమాని నుంచి దారుణమైన ప్రశ్న ఎదురుకొని వారికి తగ్గ సమాధానం చెప్పింది. 

తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆస్కీ మీ ఎనీథింగ్ అనే సెషన్ మొదలుపెట్టి అభిమానులతో చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. ఓ నెటిజన్ 'మీరు మీ కన్యత్వాన్ని ఎప్పుడు కోల్పోయారు..?' అని ప్రశ్నించాడు.  దీనికి ఇలియానా.. 'ఈ విషయంలో మీ అమ్మ ఏం చెబుతుందో ముందు అడిగి తెలుసుకో' అంటూ ఘాటుగా బదులిచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: