బిగ్ బాస్ లో గురువారం కెప్టెన్సీ టాస్క్ జరిగింది. హిమజ్, శ్రీముఖి, బాబా లలో బాబా భాస్కర్ కెప్టెన్ గా ఎన్నికయ్యాడు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో కంటెస్టెంట్స్ బాబా భాస్కర్ కి సపోర్ట్ చేసిన ఇంటి కెప్టెన్ గా గెలిపించారు. అయితే ఈ టాస్క్ లో ఆలీ మరొక్కసారి అగ్రెసివ్ గా ప్రవర్తించాడు. ఇప్పటి వరకు జరిగిన ప్రతీ టాస్క్ లో అదే తీరుగా ప్రవర్తించాడు. టాస్క్ లని చాలా సీరియస్ గా తీసుకునే ఆలీ వందశాతం ఎఫర్ట్ పెడతాడు. కానీ ఊరికే కోపానికి గురవడం ఆలీ మైనస్.


గురువారం కూడా ఆయన ప్రవర్తన అలాగే ఉంది.ఇసుకని అవతలి వ్యక్తి బాక్స్ లో నింపుతుండగా మహేష్ మగ్గుని బయటకు పారేయడం బాలేదని వాదిస్తున్నారు. ఎందుకంటే కంటెస్టెంట్స్ ఎవరికో ఒకరికి సపోర్ట్ చేయాలి తప్పితే డిఫెండ్ చేయకూడదు. డిఫెండ్ చేసుకోవడానికి కెప్టెన్సీ పోటీదారులున్నారు. అయినా ఆలీ కోపంతో మగ్గుని బయటకు విసిరేశాడు. దీంతో సంచాలకులుగా వ్యవహరిస్తున్న వరుణ్ అది కరెక్ట్ కాదని, నువ్వు తప్పుగా ఆడుతున్నావని చెప్పాడు.


పునర్నవి కూడా ఆలీ చేసింది తప్పేనని వాదించింది. అయినా కూడా ఆలీ వినలేదు. చివరికి విసుగెత్తి నేను గేమ్ ఆడను, ప్రతీ దానికి అంటున్నారని బయటకు వెళ్ళిపోతాడు. టాస్క్ పూర్తయ్యాక వరుణ్, పునర్నవిలు తాము చేసిన పనికి సారీ చెప్పాలని ప్రయత్నించినా ఆలీ పట్టించుకోలేదు. నాకు మీ సారీ అవసరం లేదనడం ఎవరికీ నచ్చలేదు. నిజం చెప్పాలంటే హౌస్ మెంబర్స్ అందరిలో ఆలీ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్.


కానీ టాస్క్ లలో  తన దురుసుతనం వల్ల అభిమానాన్ని పోగొట్టుకుంటున్నాడు. అదీ గాక ఈ సారి నామినేషన్ లో కూడా ఉన్నాడు. ఆలీ ప్రవర్తన ఇలాగే ఉంటే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తన దురుసుతనాన్ని తగ్గించుకుంటే ఫైనల్ వరకు వెళ్ళగలిగే సత్తా ఉన్న కంటెస్టెంట్ కాగలడు. మరి ముందు ముందు ఏం చేస్తాడో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: