అనుష్క లేడి ఓరియెంటెడ్ సినిమాలకి పెట్టిందిపేరు. ఈ యోగా  బ్యూటీ ఏ ముహూర్తన అరుంధతి సినిమా చేసిందో అప్పటినుండే ఈమె జాతకం పూర్తిగా  మారిపోయింది. టాలీవుడ్ లో ప్రస్తుతం అనుష్క కి ఒక స్టార్ హీరోకి ఉన్న క్రేజ్ ఉంది అంటేనే అర్థం చేసుకోవచ్చు అనుష్క రేంజ్ ఏంటో. ఒకవైపు గ్లామర్ ఒలకబోస్తూనే .. మరోవైపు నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ అందరిని ఆకట్టుకుంటు ముందుకుపోతుంది. 

అరుంధతి, పంచాక్షరీ , భాగమతి , సైజ్ జీరో వంటి సినిమాలతో తానేంటో అందరికి తెలిసేలా చేసింది అనుష్క. అలాగే ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బిగెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ బాహుబలిలో  దేవసేనగా ప్రభాస్ కి సరితూగే నటనతో అందరిని మెస్మరైజ్ చేసింది. మొదటి భాగంలో ముసలి దేవసేనగా .. రెండో పార్ట్ లో  రాణి దేవసేనగా  కత్తి తిప్పుతూ చాలా అందంగా కనిపించింది. ట్రెడిషనల్ గా చీర కట్టినా ...బీచ్ లో బికినీ వేసినా సరిగ్గా సూట్ అయ్యే  అందం అనుష్క సొంతం.

విషయానికొస్తే ... భాగమతి తరువాత అనుష్క చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్న చిత్రం నిశబ్ధం. ప్రస్తుతం ఈ సినిమా  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ అన్ని సిద్ధం చేసింది. ఈ నెల 11న ఉదయం 11 గంటల 11 నిమిషాలకు 'నిశ్శబ్దం' ఫస్ట్ లుక్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. సోలో హీరోయిన్‌గా మంచి  పేరు తెచ్చుకున్న అనుష్క.. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండటంతో మూవీపై భారీ  అంచనాలు ఉన్నాయి.

అనుష్కతో పాటు ఈ సినిమాలో  ఆర్.మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడసన్, షాలినీ పాండే, సుబ్బరాజు, శ్రీనివాస అవసరాల, హంటర్ ఓ హరో కూడా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, ఇంగ్లీషు, హిందీతో పాటు మలయాళంలో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు  సన్నాహాలు చేస్తున్నారు. అనుష్క చాలా రోజులు గ్యాప్ తీసుకొని చేస్తున్న సినిమా కావడం..టైటిల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండటంతో అందరూ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో అనుష్క మరో హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని కోరుకుందాం...


మరింత సమాచారం తెలుసుకోండి: