స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్  విక్రమ్ కుమార్  దర్శకత్వంలో  నేచురల్ స్టార్  నాని కథానాయకుడిగా   రాబోతున్న సినిమా 'గ్యాంగ్ లీడర్'.  సరికొత్త కంటెంట్ తో రివేంజ్ డ్రామాతో సాగే కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉండనుంది. మరి నానికి ఈ సినిమా హిట్ ఇస్తుందా..? 'జెర్సీ' మంచి సినిమా అనే టాక్ తెచ్చుకున్నప్పటికీ  కమర్షియల్ సక్సెస్స్ మాత్రం సాధించలేకపోయింది.  దాంతో  నానికి  ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల్సిన పరిస్థితి.. పైగా ఎప్పటి నుండో ఓ భారీ హిట్ కొట్టాలని భావిస్తున్న నాని ఆశలన్నీ ఈ  'గ్యాంగ్ లీడర్' మీదే పెట్టుకున్నాడు. మరి ఆ ఆశలు  నెరవేరతాయా ?  అయితే  ఈ సినిమా అవుట్ ఫుట్ మాత్రం   చాలా బాగా వచ్చిందట. ముఖ్యంగా  ఈ చిత్రంలో నాని క్యారెక్టర్ చాల బాగుంటుందని.. నాని క్యారెక్టర్ చుట్టూ ఉండే పాత్రల ప్రభావం వల్ల,  తనకు తెలియకుండానే నాని చేసే యాక్టివిటీస్ అలాగే   కొన్ని కీలక సన్నివేశాలు చాలా కామెడీగా సాగుతాయట.  పైగా ఎంటర్టైన్మెంట్ జానర్ నానికి బాగా  కలిసొచ్చే అంశం.  ఎందుకంటే నాని కెరీర్లో భారీ హిట్స్ గా  నిలిచిన సినిమాలు 'భలే భలే మగాడివోయ్, నేను లోకల్, అష్టా చమ్మా, పిల్ల జమీందార్, క్రిష్ణగాడి వీరప్రేమగాధ' లాంటి చిత్రాలన్నీ కామెడీ జానర్ చిత్రాలే. మరి ఆ లెక్కన  'గ్యాంగ్ లీడర్' కూడా హిట్ కావాలి.  సినిమాలో  కామెడీ కూడా బాగా పండితే  నాని ఓ భారీ హిట్ కొట్టినట్లే.  అయితే  'గ్యాంగ్ లీడర్' అంటేనే పక్కా మాస్ టైటిల్.  తెలుగు రాష్ట్రాల వరకూ ఈ టైటిల్ బాగానే ఉంటుంది గాని, ఓవర్సీస్ లో ఈ టైటిల్ ఎంతవరకూ  వర్కౌట్ అవుతుందనేది చూడాలి. 


ప్రధానంగా  ఓవర్సీస్ లో క్లాస్ అండ్ కామిక్  టైటిల్స్ కు ఉండే  క్రేజ్..   మాస్ టైటిల్స్ అంత త్వరగా ఉండదు. అందుకు ఉదాహరణ మొన్న వచ్చి హిట్ అనిపించుకున్న 'ఇస్మార్ట్ శంకరే'. మరి గ్యాంగ్ లీడర్ ఓవర్సీస్ లో రాణిస్తాడేమో చూద్దాం. ఇక  ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న  చెన్నై బ్యూటీ  ప్రియాంకా అరుళ్ మోహన్ టాలీవుడ్ లో ఎంతవరకూ నెట్టుకొస్తోందో చూడలి.  అలాగే ఇటీవలే గుణ అంటూ మరో ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్న  'ఆర్ఎక్స్ 100' హీరో  కార్తికేయ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు.  అలాగే ఇతర కీలక పాత్రల్లో  వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రఘుబాబు, సత్య  నటిస్తున్నారు.  మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్  అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: