చాలామంది హీరోలు తమకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్ళి సినిమా చేయాలనుకున్నప్పుడు కథ వినకుండానే డేట్స్ ఇచ్చేస్తారు. కానీ కొన్ని సార్లు అదే పెద్ద పొరపాటై ఆ కాంబినేషన్ లో వచ్చిన సినిమా డిజాస్టర్ అవుతుంది. దాంతో ఆ హీరో ఇంకోసారి మరే దర్శకుల దగ్గర ఇటువంటి సాహసం చేయరు. ఖచ్చితంగా కథ విన్న తర్వాతే డేట్స్ ఇవ్వడానికి సిద్దపడతారు. అలానే కథల ఎంపికలో ఎంత జాగ్రత్తగా వున్నా కానీ కొందరు దర్శకుల విషయంలో మాత్రం అల్లు అర్జున్‌ అంత స్ట్రెస్‌ చేయడు. వాళ్ళకున్న గత అనుభవం మీద నమ్మకం ఉంచేసి, వాళ్ళు చెప్పినట్టు చేసేస్తాడు. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు అల్లు అర్జున్‌ మారిపోయాడు. దర్శకుల పూర్వ వైభవం కంటే వాళ్లిప్పుడు రాసిన కథే ముఖ్యమంటున్నాడు. 

బన్ని ఇలా మరడానికి కారణం నా పేరు సూర్య అని తెలుస్తోంది. ఈ కథ మీద దర్శకుడి మీద ఎంతో నమ్మకంగా ఉన్నాడు. కానీ రిజల్ట్ మాత్రం బాగా తేడా కొట్టేసింది.
ఇంతకుముందు కథలు వినకుండానే త్రివిక్రమ్‌తో రెండుసార్లు పని చేసాడు. కానీ 'అల వైకుంఠపురములో' సినిమాకి మాత్రం త్రివిక్రమ్‌ ఎనిమిది నెలలు కష్టపడి కథ రాస్తే కానీ షూటింగ్‌ మొదలు పెట్టలేదు. అలాగే 'ఆర్య' సినిమాతో తనకి హీరోగా బ్రేక్‌ ఇచ్చిన సుకుమార్‌ విషయంలో కూడా బన్నీ ఇలాగే ప్రవర్తిస్తున్నాడట.

సుకుమార్‌ గత చిత్రం 'రంగస్థలం' రికార్డులు నెలకొల్పినా కానీ ఇప్పుడు అతనేమి రాసాడనేదే అల్లు అర్జున్‌ చూస్తున్నాడు. సుకుమార్‌ ఇప్పటికి నాలుగు వెర్షన్లు రాసినా కానీ అల్లు అర్జున్‌ ఓకే చెప్పలేదట. ఇంకేదో కావాలంటూ వాయిదా వేస్తున్నాడని తాజా సమాచారం. అందుకే మరోసారి అల్లు అర్జున్‌ని కలిసి సుకుమార్‌ కథ వినిపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ కొత్త వెర్షన్ గనక బన్ని కి నచ్చి ఓకే చేస్తే దసరాకి సినిమా పూజా కార్యక్రమం మొదలవుతుందని లేటెస్ట్ న్యూస్. ఒకవేళ సుక్కు వెర్షన్ నచ్చకపోతే మాత్రం ఏమాత్రం లేట్ చేయకుండా వేణు శ్రీరామ్‌తో అనుకుంటోన్న 'ఐకాన్‌' చిత్రానికి ముహూర్తం ఫిక్స్‌ అవుతుందని సమాచారం. మరి ఈ సారైనా సుక్కు బన్నీ ని మెప్పిస్తాడో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: