టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ వారి బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న తాజా సినిమా గ్యాంగ్ లీడర్. పదమూడు, ఇష్క్, హలో, 24 వంటి సినిమాలతో మంచి పేరు సంపాదించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని, పెన్సిల్ అనే రచయిత క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఆకట్టుకునే వైవిధ్యమైన కథ మరియు కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫస్ట్ టైం నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ టాలీవుడ్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. 

ఆర్ఎక్స్ 100 సినిమా హీరో కార్తికేయ ఈ సినిమాలో నెగటివ్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు సమాచారం. సీనియర్ నటి లక్ష్మి, శరణ్య మోహన్, రఘు బాబు, ప్రియదర్శి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ స్వరాలు సమకూరుస్తుండగా, ఫోటోగ్రఫీ ని పిసి శ్రీరామ్ అందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ మరియు సాంగ్స్ కు వీక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించడంతో, 

గ్యాంగ్ లీడర్ యూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ని ఈనెల 10వ తేదీన విశాఖపట్నంలో గ్రాండ్ లెవెల్ లో నిర్వహించనుంది సినిమా యూనిట్. ఈ సందర్భంగా కాసేపటి క్రితం గ్యాంగ్ లీడర్ యూనిట్ నుండి ఒక అధికారిక ప్రకటన వెలువడడం జరిగింది. ఇకపోతే ఈ వేడుకకు ఒక స్టార్ హీరో, ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడలవలసి ఉంది. అతి త్వరలో సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోనున్న ఈ సినిమా, ఈనెల 13న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: