యావత్ భారత దేశం గర్వించదగ్గ ప్రయోగాలు ఇస్త్రో శాస్త్రజ్ఞులు చేస్తున్న విషయం తెలిసిందే.  అంతరిక్షాన్ని శాసిస్తూ ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేశారు.  చల్లనయ్య చంద్రుడు రహస్యాలు ఏంతో అన్వేశించడానికి చంద్రయాన్ 2 ప్రయోగాన్ని ఎంతో సక్సెస్ ఫుల్ గా సాగించారు..అయితే కొద్ది నిమిషాల్లో జాబిలమ్మపై అడుగు పెడుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో ఒక్కసారే సిగ్నల్స్ కట్ కావడం అందరినీ నిరాశపరిచింది. 

చంద్రుడిపై దిగే ప్రక్రియలో కీలకమైన ఘట్టాన్ని కూడ పూర్తి చేశారు.కానీ, చంద్రుడికి 2.1కిలో మీటర్ల దూరంలోనే ల్యాండర్ విక్రమ్ నిలిచిపోయింది. ల్యాడర్ విక్రమ్ నుండి సిగ్నల్స్ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారు.అప్పటి వరకు  ప్రక్రియ సజావుగా సాగుతున్న తరుణంలోనే 300 మీటర్ల దూరంలోనే విక్రమ్ ల్యాండర్ నుండి సిగ్నల్స్ నిలిచిపోయాయి.  చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలోనే ఇస్రోకు విక్రమ్ ల్యాండర్ తో సిగ్నల్స్ నిలిచిపోయాయి.

బెంగుళూరులోని ఇస్రో సెంటర్ నుండి ప్రధాని నరేంద్రమోడీతో పాటు దేశ వ్యాప్తంగా ఎంపిక చేయబడిన విద్యార్ధులు  చంద్రయాన్-2 ను ప్రత్యక్షంగా వీక్షించారు.ల్యాండర్ విక్రమ్ నుండి సిగ్నల్స్ నిలిచిపోయిన విషయాన్ని ఇస్రో ఛైర్మెన్ శివన్ ప్రధానికి వివరించారు. అయితే చంద్రయాన్-2 కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతగానే కృషి చేశారు. కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో దానిని ప్రయోగించారు.  ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చారు ప్రధాని మోదీ..మీరు ఇప్పటికే ఎంతో ఘన సాధించారని..ఒక్క అపజయంతో వెనక్కి తగ్గలేమని..ఇలాంటి ప్రయోగాలు ఎన్నో మీరు చేసి భారత దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటుతారని ధైర్యాన్ని చెప్పారు.

ఈ నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్ శివన్ కన్నీరు పెట్టుకున్నారు. దీంతో అక్కడే ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇస్రో ఛైర్మన్ శివన్ ను హత్తుకొని ఓదార్చారు. తాజాగా చంద్రయాన్ 2 పై ఇస్రో శాస్త్రవేత్తల గొప్పతనంపై తెలుగు హీరోలు ఎంతో ధైర్యాన్ని ఇస్తూ సెల్యూట్ చేశారు.  టాలీవుడ్ సినీ ప్రముఖులంతా ఇస్రో శాస్త్రవేత్తల కృషిని కొనియాడుతూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: