‘సాహో’ లాంటి భారీ సినిమాలు తెలుగు ఫిలిం మార్కెట్ కు లాభాలు తెచ్చిపెట్టవు అన్న విషయం నిర్మాతలు అందరికీ తెలిసిపోయింది. ఇలాంటి పరిస్థితులలో అల్లు అర్జున్ తనకు ‘సాహో’ లాంటి మూవీ కావాలి అంటూ దిల్ రాజ్ పై చేస్తున్న ఒత్తిడి ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

తెలుస్తున్న సమాచారం మేరకు బన్నీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ మూవీ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక మోటార్ బైక్ దొంగతనం చుట్టూ తిరిగే ఈ కథలో మోటార్ బైక్ రేస్ ల యాక్షన్ సీన్స్ కూడ చాల కీలకంగా ఉంటాయి. దీనితో ఈ మూవీ యాక్షన్ సీన్స్ ను భారీ స్థాయిలో ‘సాహో’ లెవల్ లో తీద్దామని అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ కు చెప్పినట్లు టాక్. 

వాస్తవానికి ఈ మూవీ ప్రాజెక్ట్ ను ఈ ఏడాది చివరిలో ప్రారంభించే ఆలోచనలో దిల్ రాజ్ ఉన్నాడు. అయితే ఇప్పుడు బన్నీ తన మనసులోని ‘సాహో’ ఆలోచనలు బయట పెట్టడంతో ఈ మూవీ బడ్జెట్ పెరగడమే కాకుండా కథలో కూడ మార్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. 

అయితే ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఈ వార్తల వెనుక అల్లు అర్జున్ మనసులో మరొక వ్యూహం ఉంది అన్న ప్రచారం కూడ జరుగుతోంది. సుకుమార్ బన్నీతో సినిమా చేయడానికి తన కథను రెడీ పెట్టడంతో ముందుగా తాను సుకుమార్ కు ఇచ్చిన మాట ప్రకారం ముందు సుకుమార్ సినిమాను పూర్తి చేసి ఆ తరువాత ‘ఐకాన్’ ను మొదలుపెట్టడానికి బన్నీ తెలివిగా ‘సాహో’ మేకింగ్ ను దిల్ రాజ్ వేణు శ్రీరామ్ లపై ప్రయోగిస్తున్నాడు అంటూ ఇండస్ట్రీలో గాసిప్పులు వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: