ప్రభాస్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి వివాదాలకు దూరంగా అందరితోను చాల సరదాగా ఉంటూ ఉంటాడు. దీనితో టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడ ప్రభాస్ కు మంచి స్నేహితులు ఉన్నారు. ముఖ్యంగా హీరో సూర్య ప్రభాస్ కు చాల సన్నిహితంగా ఉంటాడు.

ఇలాంటి పరిస్థితులలో ప్రభాస్ నటించిన ‘సాహో’ పై సెటైర్లు వేసిన తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు పై ప్రభాస్ అభిమానులు మండి పడుతున్నారు. ఈ దర్శకుడుకి ‘బాహుబలి’ లాంటి భారీ మూవీ తీయాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు. 

అయితే అతడి కలలు తీరడం లేదు. ఇలాంటి పరిస్థితులలో తమిళంలో రిలీజ్ అయిన ‘సాహో’ ను చూసి వెంకట్ ప్రభు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ‘సాహో’ తో పోటీపడుతూ అదేరోజు తమిళంలో ‘వైభవ్’ అన్న చిన్న సినిమా విడుదలైంది. ఈ మూవీ విజయం సాధించడంతో కోలీవుడ్ మీడియా ఈ మూవీని ఆకాశంలోకి ఎత్తేస్తూ ‘సాహో’ పై విపరీతంగా సెటైర్లు వేస్తోంది. 

ఈ పరిస్థితులలో ఈ విషయానికి కొనసాగింపుగా ఒక షాకింగ్ ట్విట్ చేసాడు. ‘SAHOdaran వైభ‌వ్‌కు శుభాకాంక్ష‌లు’ అంటూ చేసిన ట్విట్  త‌మిళ మీడియాలో వైరల్ గా మారిపోయింది. వాస్తవానికి వెంకట్ ప్రభు సూర్యాని హీరోగా పెట్టి తీసిన ‘రాక్షసుడు’ మూవీ తెలుగులో ‘మాస్’ పేరుతో డబ్బింగ్ చేయబడి 2015 లో విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్ ఫంక్షన్ కు అతిధిగా ప్రభాస్ వచ్చి వెంకట్ ప్రభును ఆకాశంలోకి ఎత్తేస్తూ అప్పట్లో ప్రభాస్ అతడి పై ప్రశంసలు కురిపించాడు. ప్రభాస్ చేసిన ఆనాటి సహాయాన్ని మరిచిపోయి ఇలా ‘సాహో’ ను నెగిటివ్ గా కామెంట్ చేస్తూ వెంకట్ ప్రభు చేసిన కామెంట్స్ ప్రభాస్ ను వెన్నుపోటు పొడిచినట్లుగా భావిస్తూ ప్రభాస్ అభిమానులు వెంకట్ ప్రభును టార్గెట్ చేస్తున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: