ఎప్పుడు నవ్వుతూ కనిపించే నాగచైతన్యలో ఒక కనిపించని వేదాంతి ఉన్నాడు అన్న విషయం చాల తక్కువ మందికి తెలిసిన విషయం. నాగార్జున నట వారసుడుగా ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య హీరో కెరియర్ 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతన్య అనేక షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. 

తాను సమంతను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను కాబట్టి తమ మధ్య ఎప్పుడు తగువులు ఉండవు అని చాలామంది అనుకుంటారని అది అవాస్తవం అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు వారానికి ఒకసారి ఎదో ఒక విషయంలో తమ మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడతాయని ఆ సందర్భంలో తాను కోపగించి మాట్లాడటం మానేసినప్పుడు సమంత తనకు తానుగా వచ్చి తనతో మాట్లాడి తన కోపాన్ని పోగొడుతుంది అన్న విషయాన్ని వివరించాడు. 

ప్రతి మనిషిలోను కనిపించని మరొక మనిషి ఉంటాడని ఆ విషయం పెళ్ళి అయిన తరువాత మాత్రమే తెలుస్తుందని వ్యతిరేక పరిస్థితులు ఎదురైనప్పుడు మన లైఫ్ పార్టనర్ లోని అసలు వ్యక్తి బయటకు వస్తాడు అంటూ ప్రేమించుకున్నంత మాత్రాన గొడవలు ఉండవా అంటూ జోక్ చేసాడు చైతు. తనకు తన కెరియర్ మొదట్లో డబ్బు సంపాదన మీద కోరిక ఉండేదని అన్న విషయాన్ని బయటపెడుతూ తాను కోరుకున్నంత డబ్బు వచ్చి అన్నీ కొనుక్కున్న తరువాత ఇక జీవితంలో డబ్బు ఆలోచన ఎందుకు అని అనిపించినా రేపటి రోజు గురించి భయపడి తాను సంపాధించ వలసి వస్తోంది అంటూ కామెంట్స్ చేసాడు. 

తనకు ప్రస్తుతం 32 సంవత్సరాలనీ తన తండ్రి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా ఆయనలో కనిపించే ఎనర్జీ లెవల్స్ చూస్తే తనకు షాక్ ఇస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. తన తాత అక్కినేని గురించి మాట్లాడుతూ తనకు చిన్నతనం నుండి ఒక తాతలా కాకుండా ఒక గైడ్ లా తన జీవితాన్ని ప్లాన్ చేసారని ఆయన గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇప్పటికీ తనకు కన్నీరు ఆగదు  అంటూ తన తాత పై అభిమానాన్ని చాటుకుంటున్నాడు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: