బయోపిక్ సినిమాల హవా ఇంకా కొనసాగుతూనే ఉంది.. అయితే ఒక వ్యక్తి జీవిత కథతో ఒకేసారి మూడు బయోపిక్ రావడమే ఆశ్చర్యకరమని చెప్పొచ్చు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె బయోపిక్ గా పోటీ పడి మరి సినిమాలు ఎనౌన్స్ చేశారు. ముందుగా ప్రియదర్శిని డైరక్షన్ లో ది ఐరన్ లేడీ-ఏ స్టోరీ ఆఫ్ రివల్యూషనరీ లేడీ అంటూ ఓ సినిమా మొదలు పెట్టారు.       


ఈ మూవీలో నిత్యా మీనన్ జయలలిత పాత్రలో నటిస్తుంది. దర్శక నిర్మాత లింగుస్వామి ఈ సినిమా నిర్మాణంలో భాగమవుతున్నాడు. అయితే మరోపక్క కోలీవుడ్ డైరక్టర్ ఏ.ఎల్. విజయ్ కూడా తలైవి అంటూ మరో సినిమా మొదలుపెట్టారు. కంగనా రనౌత్ కూడా ఈ సినిమా కోసం హోం వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది.    


ఇక ఇవి రెండు సినిమాలే కాదు జయలలిత బయోపిక్ ను వెబ్ సీరీస్ రూపంలో తీస్తున్నాడు దర్శక నిర్మాత గౌతం మీనన్. ఈ వెబ్ సీరీస్ లో జయలలితగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసే రమ్యకృష్ణ జయలలితగా ఎలా ఉండబోతుంది అన్న ఎక్సైట్మెంట్ ప్రేక్షకుల్లో ఏర్పడింది. రీసెంట్ గా వెబ్ సీరీస్ నుండి రిలీజైన ఫస్ట్ లుక్ ఇంప్రెస్ చేసింది.     


ఒక జీవిత చరిత్ర మూడు కథలుగా చెబుతున్నారు. అయితే ఇందులో ఎవరు జయలలిత జీవిత కథను పర్ఫెక్ట్ గా చెబుతారో చూడాలి. అయితే ఈ మూడింటిలో నటించే నటీమణులు కూడా ప్రతిభగల వారే.. నిత్యా మీనన్, కంగనా, రమ్యకృష్ణ వీరిలో జయలలితగా ఎవరు ఎంత ఎక్కువగా ఇంప్రెస్ చేస్తారో చూడాలి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే జయలలిత బయోపిక్ గా వస్తున్న రెండు సినిమాలు.. ఒక వెబ్ సీరీస్ మూడింటిపై ఆడియెన్స్ భారీ అంచనాలతో ఉన్నారు.  
 



మరింత సమాచారం తెలుసుకోండి: