టాలీవుడ్ లో ఇడియట్ సినిమాతో మాస్ మహరాజా గా పేరు తెచ్చుకున్న హీరో రవితేజ.  ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కుడు సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.  వరుసగా రవితేజ నటించిన సినిమాలు హిట్ కావడంతో టాప్ హీరోగా ఎదిగిపోయాడు.  అంతకు ముందు చిన్న చిన్న పాత్రల్లో నటించిన రవితేజ తర్వాత హీరోగా ఎదిగి నిర్మాతలకు మినిమం గ్యారెంటీ హీరోగా మారాడు.  అలాంటిది బలుపు, పవర్ సినిమాల తర్వాత వరుస అపజయాలు పొందడంతో రెండు సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. 

ఆ రెండు సంవత్సరాల తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ సినిమాతో సూపర్ హట్ అందుకున్నాడు.  ఇక స్టార్ హీరోల తనయులు హీరోలుగా ఎంట్రీ హీరోలు గా ఎంట్రీ ఇస్తున్న సమయంలో విశ్వనటుడు కమల్ హాసన్ పెద్ద కూతురు శృతిహాసన్ హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయ్యింది.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.  హీరోయిన్ మంచి పొజీషన్ లో ఉండగానే విదేశీయుడి ప్రేమలో పడి కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది.  అయితే రవితేజ, శృతిహాసన్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ బలుపు.  ఈ మూవీ అప్పట్లో మాస్ హిట్ గా నిలిచింది. 

ప్రస్తుతం రవితేజ కథానాయకుడిగా 'డిస్కోరాజా' చిత్రం రూపొందుతోంది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. మాస్ ఆడియన్స్ కి తమ గ్లామర్ తో మంత్రం వేసే పాయల్ .. నభా నటేశ్ నటిస్తున్నారు.  ఈ మూవీ తర్వాత  దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి రవితేజ సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం శ్రుతిహాసన్ ను తీసుకునే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారట. శృతిహాసన్ ఈ మూవీకి ఒప్పుకునే ఛాన్సులు ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఒకవేళ ఇదే జరిగితే రవితేజ మంచి హిట్ కలిసి వస్తుందేమో అంటున్నారు ఫిలిమ్ వర్గాలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: