నయనతార క్రేజే వేరు. ఇప్పటికి పద్నాలుగేళ్ళుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటున్న నయన్ ఎక్కడా తన మోజు తగ్గించుకోవడం లేదు. నయన్ కావాలి అని టాలీవుడ్ ఒకటే కలవరిస్తోంది. ఆమె డేట్స్  దొరికితే చాలు అని టాలీవుడ్ వెటరన్ హీరో అప్పట్లో జపం చేశాడంటేనే నయన్ కోసం ఎంతలా కలవరిస్తారో అర్ధమైపోతోంది. ఆ మూవీలో సీనియర్ హీరో ఉన్నా కూడా అసలైన హీరో మాత్రం నయనతారేనని చిత్ర యూనిట్ కూడా నాడు అంగీకరించింది.


ఇదంతా గతమైతే ఇపుడు కూడా నయన్ ఎక్కడా తన  డిమాండ్ తగ్గించుకోవడంలేదు. తెలుగులో ఆమె లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ తో నటించడం ఒక అవకాశం అయితే ఇందులో నయన్ కి అదిరిపోయే రెమ్యునరేషన్ ప్రొడ్యూసర్ రామ్ చరణ్ ఇచ్చారట. అది ఇపుడు లీక్ అయి ఒకటే  వైరల్ అవుతోంది.  


ఏకంగా ఆరు కోట్ల రూపాయలు నయన్ కి చెల్లించాడని టాక్ నడుస్తోంది. ఈ మూవీని తెలుగు, తమిళ్, హిందీలలో  కూడా రిలీజ్ చేస్తున్నందువల్ల నయన్ క్రేజ్ అంతటా వుంది కాబట్టి ఆ రెమ్యునరేషన్ కరెక్ట్ అని చిత్ర యూనిట్ భావించిందట. దాంతో నయన్ కి ఈ రెమ్యునరెషన్ ఇచ్చుకున్నారట. 


ఇదిలా ఉండగా ఇంత రెమ్యునరేషన్ తీసుకుని కూడా నయన్  ఈ చిత్ర ప్రమోషన్ కి వస్తుందా రాదా అన్న డౌట్లు ఇపుడు వస్తున్నాయి. ఎందుకంటే నయన్ ఎపుడూ కూడా ఏ తెలుగు మూవీ  ప్రమోషన్ కి రాలేదు కాబట్టి. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి కూడా నయం డుమ్మా కొట్టింది.


అయినా ఆమె మెగాస్టార్  కు సరైన  జోడీగా భావించడం, సైరా మూవీలో క్యారక్టర్ కి ర్ కి ఆమె యాప్ట్ అని యూనిట్ డిసైడ్ కావడంతో నయన్ అడిగినంతా చెల్లించి మరీ సైరా లో తీసుకున్నరట. మరి నయన్ తన యాక్షన్ తో ఎలా అదరగొట్టింది మూవీలో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: