ఆమెకు నటన పుట్టుకతోనే వచ్చింది. అందం విషయానికి వస్తే రంగు చామనఛాయ అయినా ముఖంలో కల లక్ష్మిదేవి కల. ఇది అంత ఎవరి గురించి చెప్తున్నారు అని అనుకుంటున్నారా ? ఇంకెవరండీ ఈ మధ్యే వచ్చిన కౌసల్య కృష్ణమూర్తి' సినిమాలో నటించిన మన తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్ గురించి చెప్తున్నా. 


ఆమెది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆమె తాతయ్య అమర్ నాథ్ గారు, తండ్రి రాజేష్ కూడా సినీ నటులే. ఇంకా ఆమె మేనత్త ఎవరో కాదు ప్రముఖ హాస్య నటి శ్రీలక్ష్మి మన అందరికి తెలిసినమే. అయితే కుటుంబం అంత సినిమాల్లో నటించే వారే అయినప్పటికీ అతి మంచితనంతో ఆస్తులన్నీ కరిగించుకొని ఆమె చిన్నప్పటి నుంచి ఆర్ధిక సమస్యల్లోనే పెరిగింది. 


ఇంకా చిన్నప్పటి నుంచి ఆమెని ఆమె తల్లే కష్టపడి పెంచింది. చిన్నప్పటి నుండే ఎన్నో కష్టాలు పడిన ఆమె తల్లికి విశ్రాంతి ఇవ్వాలి అని తండ్రిలనే ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అయితే ఇండస్ట్రీలో చాలా వరకు అందరికి నటన కంటే శరీరం రంగే కావాలి. అలానే ఆమెకి కూడా రంగు చూసి సీరియల్స్ లో అవకాశాలు వచ్చాయి తప్ప సినిమాల్లో రాలేదు. 


అయినప్పటికీ చేద్దాం అనుకుంటే సీరియల్స్ లో రోజంతా కష్టపడినా 500, 1000 రూపాయిల కంటే ఎక్కువ ఇవ్వరు అని ఆమెకు అర్థం అయ్యింది. అప్పుడు ఉన్న ఆర్ధిక పరిస్థులను దృష్టిలో పెట్టుకొని ఆమె సినిమాల్లోకి వెళ్ళాలి అని చూస్తే అక్కడ ఎన్నో భరించలేనన్ని అవమానాలు ఎదురయ్యాయ. 


ఒకానొక సారి ఆమె అవకాశం కోసం వెళ్తే ''తెల్లగా ఉన్నవాళ్లకే అవకాశాలు దొరకట్లేదు. నీ రంగుకి సినిమాలు కూడానా?' అంటూ ఘోరంగా అవమానించారు అని ఆ సమయంలో ఆ మాటలు ఎంతో బాధపెట్టినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉందని, అమెంటో నిరూపించుకోవాలి అని కసి పెంచుకుందని, సినీ రంగంలో ఎవరి సపోర్టు లేకపోయినా ఆమెని ఆమె నమ్ముకుంది అని ఆమె చెప్పుకొచ్చింది. 


ఆలా సినిమాల్లో దాదాపు 5 ఏళ్లపాటు చిన్న సినిమాల్లో సెకండ్‌ హీరోయిన్‌, ఫ్రెండ్‌ పాత్రలు వచ్చాయని, అలా వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకొని ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరవాత ఆమె నటన చూసి మణిరత్నం, గౌతమ్‌మీనన్‌, బాలీవుడ్‌ నటుడు అర్జున్‌రామ్‌పాల్‌ వెతుక్కుంటూ వచ్చి అవకాశాలిచ్చారాని చెప్పింది. 


అయితే ఒకప్పుడు ఆర్ధిక సమస్యల్లో ఉన్నప్పుడు ఫ్లాట్‌ అమ్మేసిన టి.నగర్‌లోనే ఆమె అమ్మకి ఓ ఇల్లు  కొన్న అని ఎవరైతే రంగు గురించి అవమానించారో వల్లే ఇప్పుడు వచ్చి అవకాశాలు ఇస్తున్నారని ఆమె చెప్పింది. అయితే కౌసల్య కృష్ణమూర్తి సినిమా సక్సె చేస్తున్న ఆమె ఇప్పుడు విజయ దేవరకొండ సరసన క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో నటిస్తుంది. ఇది అండి మన తెలుగు అమ్మాయి కథ. ఆశ, పట్టుదల ఉంటె ఏదైనా సాధించవచ్చు అనడానికి ఈ కలువకళ్ల బ్యూటీ ఓ నిదర్శనం.  


మరింత సమాచారం తెలుసుకోండి: