రవిబాబు దర్శకుడిగా మారక ముందు నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రలు పోషించి తండ్రిలాగానే బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత దర్శకుడిగా మారి ఈ.వి.వి కొడుకు అల్లరి నరేష్ ని హీరోగా తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఆ తర్వాత నచ్చావులే అంటూ రామోజీ క్యాంప్ నుంచి చిన్న సినిమాలకు శ్రీకారం చుట్టి, సురేష్ బాబు క్యాంప్ లోకి వచ్చారు రవిబాబు. వరుసగా సోగ్గాడు, అనసూయ వంటి సినిమాలతో మంచి సక్సస్ ను అందుకున్నాడు. అయితే ఈ సినిమాల తర్వాత అవును 2, అదిగో లాంటి ఫ్లాపులు వచ్చాయి. దాంతో రవిబాబు డైరక్షన్ కెరీర్ కాస్త వెనుక బడింది. ఇప్పుడు మరో చిన్న సినిమాను తెరకెక్కించారు. అంతా కొత్తవాళ్లతో రూపొందించిన ఆ సినిమా టైటిల్ 'ఆవిరి'. 

ఇక ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, ఈ సినిమా విడుదల బాధ్యతలు ఏస్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తీసుకున్నారు. ఈ సినిమాను ఆయన విడుదల చేయనున్నారని సమాచారం. ఇప్పటి వరకు సురేష్ బాబుతో ప్రయాణించిన రవిబాబు ఒక్కసారిగా దిల్ రాజు వైపు రావడం ఇండస్ట్రీలో అందరిని ఆశ్చర్య పరచింది. వాస్తవానికి సురేష్ బాబు కూడా చిన్నసినిమాలు ఏవి వచ్చినా, బ్యానర్ యాడ్ చేసి, విడుదల చేయించి, అడ్వాన్స్ లు ఇచ్చి ఎంతగానో సహకరిస్తున్నారు...ప్రోత్సహిస్తున్నారు.

కానీ రవిబాబు ఆ క్యాంపస్ వదిలి దిల్ రాజు క్యాంపస్ లోకి రావడం వెనుక అసలు కారణం ఏమై వుంటుందో? అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఒకటి రెండు రోజుల్లో రవిబాబు సినిమా దిల్ రాజు విడుదల చేయబోతున్నారనే అధికారిక ప్రకటన రాబోతోందని ఫ్రెష్ అప్‌డేట్.  ఇక దిల్ రాజు కూడా ఈ మధ్య కొన్ని పెద్ద సినిమాలను నిర్మించి, డిస్ట్రిబ్యూట్ చేసి బాగానే నష్టాలను చూశాడు. బహుషా అందుకనే రవిబాబు తీసిన సినిమా కంటెంట్ మీద బాగా నమ్మకం ఉండే చిన్న సినిమా కాబట్టి పెద్దగా నష్టం రాదనే ఉద్దేశ్యంతో ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: