ఈ మద్య టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ల సందడి బాగా పెరిగిపోయింది.  సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి తీసిన ‘ఆర్ఎక్స్ 100’ మూవీ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.  ఈ మూవీ అందరూ కొత్తవారే కావడం మరో విశేషం.  డైరెక్టర్ గా అజయ్ భూపతికి ఇది ఫస్ట్ మూవీ..హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ అందరూ కొత్త వారే అయినా కంటెంట్ పరంగా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది.  వాస్తవానికి ఈ మూవీ పోస్టర్, టీజర్, ట్రైలర్ చూసి ఎన్నో విమర్శలు వచ్చాయి.

ఈ మూబీ బోల్డ్ మూవీగా భావించారు..మహిళా సంఘాల నుంచి వ్యతిరేకత కూడా వచ్చింది.  వాస్తవానికి ఆర్ ఎక్స్ 100 లో బోల్డ్ సీన్లు ఉన్నాయి..కానీ కథాపరంగా అవన్నీ పెద్దగా ఎక్స్ పోజ్ కాలేదు.  మొదటి వారం ఈ సినిమా పై రక రకాల రూమర్లు వచ్చినా..రెండో వారం కలెక్షన్ల పరంగా దూసుకు పోయింది.  నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ల లాభాల పంట పండించింది.  ఈ మూవీ తర్వాత హీరో, హీరోయిన్లకు వరుస ఛాన్సులు రావడం మొదలయ్యాయి. ఈ మూవీలో నటించిన పాయల్ రాజ్ పూత్ ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ‘డిస్కో రాజా’ లో నటిస్తుంది.

త్వరలో  ‘ఆర్డీఎక్స్ లవ్’  సినిమా రాబోతుంది.  ఈ మూవీ టీజర్ ఇటీవల రిలీజ్ అయ్యింది..ఇందులో కూడా బోల్డ్ లైలాగ్స్, సీన్లు కనిపిస్తున్నాయి. ఈ సినిమాను శంకర్ భాను తెరకెక్కిస్తుండగా, రాధన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాను ఈ నెలలోనే విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. తాజాగా గణేశ్ ఉత్సవాల సందర్భంగా పాయల్ రాజ్ పుత్ సంబరాల్లో పాల్గొంది. ఈ ఊరేగింపులో స్నేహితులతో కలిసి ఆమె సంతోషంతో చిందేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: