పంకజ్ కేసరి,సినిమాటోగ్రఫీ పంకజ్ కేసరి,సినిమాటోగ్రఫీ పవర్ లేని కథ,స్లో నేరేషన్,రెండవ అర్ధ భాగం సాగదీయడం,ఎడిటింగ్,ఫైట్స్ మరియు డైరెక్షన్ 1980 లో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రం కాళిచరణ్. పశుపతి (పంకజ్ కేసరి) గ్యాంగ్ లో ఒక ముఖ్యమయిన వ్యక్తిని చంపేస్తాడు కాళిచరణ్. అక్కడ నుండి కథ నల్గొండ మొదలవుతుంది, హత్య కారణంగా అరెస్ట్ అయిన కాళిచరణ్ ను కోడలి ప్రభు (రావు రమేష్)బెయిల్ మీద విడుదల చేయిస్తాడు.. కాళిచరణ్ అండతో పశుపతి కి పోటీగా ఎలక్షన్ లో నిలబడతాడు కోడలి ప్రభు . ఇదిలా ఉండగా కాళి చరణ్ కి తీర్థ (చాందిని ) తో పెళ్లి అవుతుంది. అసలు కాళిచరణ్ పశుపతి గ్యాంగ్ లో వ్యక్తిని చంపాల్సిన అవసరం ఏంటి? పశుపతి నుండి కాళి చరణ్ తన భార్యను మరియు స్నేహితులను ఎలా కాపాడగలిగాడు అనేది మిగిలిన కథభోజ్ పురి నటుడు పంకజ్ కేసరి ప్రదర్శనలో దారుణమయిన ప్రదర్శన ఈ చిత్రంలోనిదే అయన నటన మరియు డైలాగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. చాందిని చూడటానికి బాగుంది కాని నటనా పరంగా అసలు ఆకట్టుకోలేదు. చైతన్య ఇప్పటి వరకు చేసిన వాటిలో ఇదే అద్భుత ప్రదర్శన కాని అయన పాత్రకు ఎమోషనల్ కంటెంట్ మిస్ అయ్యింది. కవిత తన నటనతో ఆకట్టుకుంది. రావు రమేష్ పాత్రా పెద్దగ లేకపోవడంతో అయన చేసేది కూడా మీ లేకుండా పోయింది. మిగిలిన పాత్రలని జస్ట్ ఒకే అనిపించాయి.ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ది బెస్ట్ డైరెక్టర్స్ లో రామ్ గోపాల్ వర్మ ఒకరు, ఆయనకి శిష్యుడు అని చెప్పుకొనే వ్యక్తి నుండి రావాల్సిన సినిమా కాదిది. ఈ సినిమాలో మొదటి నుంచి స్క్రీన్ ప్లే సరిగా లేకపోవడంతో సినిమా సరిగా ఉండదు. ఈ సినిమాలో పలనా సీక్వెన్స్ అన్నా బాగుంది అని చెప్పుకునేలా ఒకటీ లేదు. సినిమాలో ఉన్న ఎమోషన్స్ ని సీన్స్ లో చూపించి ఆడియన్స్ కి కనెక్ట్ చేయలేకపోయారు. విశ్వనాధ్ - సతీష్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో చూపించిన లొకేషన్స్ కోసం సినిమాటోగ్రాఫర్ - డైరెక్టర్ చేసిన రీసర్చ్ ని మెచ్చుకునే తీరాలి. ఎందుకంటే లోకేషన్స్ అంత బాగున్నాయి. నందన్ రాజ్ అందించిన సాంగ్స్ పెద్దగా లేకపోయినప్పటికీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా సీన్స్ ని నిలబెట్టింది. సినిమాలో ఎమోషనల్ సీన్స్ సరిగా రాలేదు. అలాంటి సీన్స్ కట్ చేసే తప్పుడు ఎడిటర్ ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది. ఫైట్స్ జస్ట్ యావరేజ్. నిర్మాణ విలువలు బాగున్నాయి.రామ్ గోపాల్ వర్మ శిష్యుడిని అని చెప్పుకొని వచ్చిన ప్రవీణ్ శ్రీ ఆ స్థాయిలో ప్రదర్శన చూపలేకపోయాడు. గాయం 2 చిత్రం తో ప్రేక్షకుల ముందుకి వఛ్చిన ప్రవీణ్ శ్రీ ఆ చిత్రంలో చేసిన తప్పునే తిరిగి రిపీట్ చేసాడు. కాన్సెప్ట్ అయితే బాగుంది కాని కథనాన్ని గ్రిప్పింగ్ గా లేదు. ఈ చిత్రం తీయడానికి పడ్డ కష్టాన్ని కాపాడుకోవడంలో ప్రవీణ్ శ్రీ దారుణంగా ఫెయిల్ అయ్యారు. చిత్రంలో సన్నివేశాలను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాపాడటం వరకు పరిస్థితి వెళ్ళింది అంటే అర్ధం చేసుకోవచ్చు. ఈ చిత్రం కథనం చాలా వీక్ , కహనం చాలా వీక్ కథ చాలా పూర్ ఇటు సాంకేతిక వర్గం అటు నటీనట వర్గం ఆకట్టుకోవాలన్న ప్రయత్నం చేసారు కాని ఆకట్టుకోలేకపోయారు. ఈ చిత్రం చూడటం టైం వేస్ట్.. నా సలహా అయితే ఈ చిత్రాన్ని చూడటం కన్నా చూడకుండా ఉండటం మంచిది.Chaitanya Krishna,Chandini,Sri Prawinకాళీ చరణ్ - "ఖాళీ" చరణ్

మరింత సమాచారం తెలుసుకోండి: