ఊహకందని మలుపులు ..ఉహించని ట్విస్టులతో క్షణ క్షణానికి మారే గేమ్ బిగ్ బాస్. ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ మూడో సీజన్ చాలా ఆసక్తిగా ముందుకుపోతుంది. ఇప్పటికే తెలుగు సీజన్ 3 ప్రారంభమై 50 రోజులు పూర్తి కావడంతో ..హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్ కి తమ 50 రోజుల ప్రయాణాన్ని వీడియో ద్వారా చూపించారు. ఇక ఈ బిగ్ బాస్ హౌస్లో గొడవలు , స్నేహాలు , కలహాలు , సంబంధాలు సర్వసాధారణమే. నేడు తప్పు అనిపించింది ..రేపు కరెక్ట్ అని పించవచ్చు. ఇకపోతే బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో లో అత్యంత ముఖ్యమైనది ఎలిమినేషన్ . అసలు ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలిమినేట్ అవుతారో చెప్పలేము. ఎందుకు అంటే  బిగ్ బాస్ లో న్యాయనిర్ణేతలు  ప్రేక్షకులే. కాబట్టి వారి ఓటింగ్స్ ద్వారానే ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. 
ఈ వారంలో మహేష్ , అలీ , రవి , శ్రీముఖి , రాహుల్ లు నామినేషన్స్ లో ఉండగా అనూహ్యంగా ఈ ఐదుగురిలో నుండి అలీ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్లో నుండి బయటకి వచ్చేసాడు. ఈ వారంలో కచ్చితంగా మహేష్ కానీ , రాహుల్ కానీ బయటకి వెళ్లిపోవడం ఖాయం అని భావించారు. కానీ , అనూహ్యంగా అలీ ఎలిమినేట్ అయ్యాడు. దీనికి ప్రధాన కారణం ఒకరకంగా హౌస్ మేట్స్ కూడా కారణమే ..అలీ ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్లిపోతుంటే ఏడుస్తూ కనిపించిన హౌస్ మేట్స్ ఈ వీక్ స్టార్టింగ్ లో అలీని నామినేషన్ లోకి తోసేశారు. పరోక్షంగానో .. ప్రత్యక్షంగానో అలీ ఎలిమినేషన్స్ కి శివజ్యోతి , హిమజ తప్ప మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కారకులే. 
అలాగే అలీ ఎలిమినేట్ అయ్యాడు అని నాగార్జున ప్రకటించగానే  అలీ నువ్వు వెళ్లిపోవడం ఏంటి .. అన్నంత రేంజ్‌లో నువ్వు  ఎలిమినేట్ కావడం ఏంటిరా, అంటూ ఒకర్ని మించి ఒకరు వీరలెవల్లో పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఇక్కడ మరో  విచిత్రం ఏంటంటే.. అలీకి ఇంటిలో ఉండటానికి అర్హత లేదంటూ ఓట్లు వేసిన వాళ్లే తిరిగి ఏడుస్తూకనిపించారు. మొత్తంగా అలీ ఎలిమినేట్ అయ్యాడు అని  బిగ్ బాస్ అభిమానులు ఇంకా జీర్ణించుకోలేక ఉన్నారు. ఇక ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ..ఈ సీజన్ లో అలీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా నామినేషన్స్ ని పేస్ చేయలేదు. నామినేషన్స్ లోకి వచ్చిన మొదటిసారే ఇలా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చేసాడు. అలీ రెజా విషయంలో జరిగిన విధముగా బిగ్ బాస్ చరిత్రలో జరిగి ఉండదని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే గత ఆరువారాలుగా నామినేషన్ లోకి  కూడా రాని అలీ , వచ్చిన వెంటనే ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్లిపోవడం బిగ్ బాస్ చరిత్రలో ఇదే మొదటిసారి అయ్యి ఉండచ్చు. ఆ విధంగా బిగ్ బాస్ లో అలీ రెజా ఎవరికీ సాధ్యంకాని ఒక రికార్డ్ సృష్టించాడు అని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: