మెగా హీరో వరుణ్ తేజ్ నెగటివ్ రోల్ లో వస్తున్న సినిమా వాల్మీకి. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగుర్తండా రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ హీరో అధర్వ నటిస్తున్నాడు. ఇక సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుండగా మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను హరీష్ శంకర్ డైరెక్ట్ చేశారు.


మెగా హీరోలకు సూపర్ హిట్లు ఇచ్చిన హరీష్ శంకర్ వరుణ్ తేజ్ కు హిట్ ఇచ్చేలా ఉన్నాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. ఈ ట్రైలర్ చూసిన మెగా ఫ్యాన్స్ వరుణ్ తేజ్ నట విశ్వరూపం చూసి షాక్ అవుతున్నారు. ముకుంద సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ సినిమా సినిమాకు నటుడిగా పరిణితి చెందుతున్నాడు.   


వాల్మీకి సినిమాలో గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ తేజ్ అదరగొట్టాడు. సినిమాలో వరుణ్ తేజ్ తో పాటుగా అధర్వ నటిస్తున్నాడు. గద్దలకొండ గణేష్ వరుణ్ తేజ్ కెరియర్ లో నిలిచిపోయే పాత్ర అని చెప్పొచ్చు. మెగా హీరోలు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ తో సినిమాలు చేస్తున్నాడు. వారికి భిన్నంగా ప్రయోగాలతో వరుణ్ తేజ్ సర్ ప్రైజ్ చేస్తున్నాడు. కెరియర్ హీరోగా మంచి ఫాం లో ఉన్న టైంలో ఇలా నెగటివ్ రోల్ చేయడం కూడా పెద్ద సాహసమే అని చెప్పొచ్చు.


హరీష్ శంకర్ ఈ సినిమాను ఎంతో కేర్ ఫుల్ గా తీశాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రాం ఆచట, గోపి ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో సాంగ్స్ కూడా సూపర్ అనేలా ఉన్నాయి. ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సెప్టెంబర్ 20న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: