మహాభారతంలో కర్ణుడి మరణానికి ఎన్ని కారణాలు ఉన్నాయో ‘సాహో’ పరాజయానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక సినిమా విజయానికి అత్యంత కీలకంగా ప్రభావితం చేసే అంశం మ్యూజిక్ విషయంలో కూడ ‘సాహో’ నిర్మాతలు అశ్రద్ధ చేసారు. 

మొదట్లో ‘సాహో’ కు శంకర్ ఇషాన్ లాయ్ ల చేత పాటలు కంపోజ్ చేయిద్దామని అనుకుని వారికి ‘సాహో’ దర్శక నిర్మాతలకు ఏర్పడ్డ భేధాభిప్రాయాలు వలన వారిని తొలిగించి ఈ మూవీలోని నాలుగు పాటలను నలుగురు సంగీత దర్శకుల చేత కంపోజ్ చేయించారు. వాస్తవానికి ఈ మూవీలో 5వ పాట కూడ ఉంది. 

ఈ 5వ పాటను దేవిశ్రీ ప్రసాద్ తో కంపోజ్ చేయించినట్లు టాక్. ఈ మూవీలో ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్ గా ఈ పాటను పెడదామని భావించినా ఆతరువాత ఆలోచనలు మారిపోయినట్లు తెలుస్తోంది. దీనికితోడు దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ట్యూన్ కూడ ప్రభాస్ కు పూర్తిగా నచ్చకపోవడంతో ఈ పాటను పక్కకు పెట్టేసారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. దీనితో ‘సాహో’ ఫెయిల్యూర్ లో దేవిశ్రీ ట్యూన్ కు ఫెయిల్యూర్ మాట పడకుండా తప్పించుకున్నట్లు అయింది. 

ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న పాటల ట్యూన్స్ అన్నీ ఫెయిల్ అవుతున్న పరిస్థితులలో దేవిశ్రీకి అత్యంత సన్నిహితుడైన అల్లు అర్జున్ కూడ అతడిని పక్కకు పెట్టేసాడు అన్న గాసిప్పులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో తాను చేసిన పాట ట్యూన్ కు ప్రభాస్ అభిమానులతో మాటలు పడకుండా తనకు రావలసిన పారితోషికాన్ని చక్కగా తీసుకుని దేవిశ్రీ నిందపడకుండా తప్పించుకోగలిగాడనుకోవాలి. ‘సాహో’ కలక్షన్స్ ఈ వారంతానికి 4వందల కోట్ల స్థాయికి చేరుకోబోతున్నా ఇంత భారీ కలక్షన్స్ వచ్చిన ఒక సినిమా పై ఇప్పటికీ నెగిటివ్ కామెంట్స్ దాడి జరగడం చూస్తే ఈ మూవీ పై ప్రేక్షకులు ఎంత భారీ అంచనాలు పెట్టుకున్నారో అర్ధం అవుతుంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: