ఈ మధ్య బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. గడిచిన రెండు సంవత్సరాలలో ఎంతో మంది జీవితాలని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అయితే వాటిల్లో కొన్ని మాత్రమే విజయవంతం అయ్యాయి. అటు బాలీవుడ్ నుండి టాలీవుడ్ దాకా వరుస పెట్టి బయోపిక్ లు వస్తున్నాయి. అయితే వాటిల్లో ఎక్కువగా రాజకీయ నాయకులవే కావడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ మీద కూడా బయోపిక్ వచ్చింది. వివేక్ ఓబెరాయ్ మోదీ పాత్రలో కనిపించారు.కానీ ఇది అనుకున్నంత విజయాన్ని సాధించలేదు.


అయితే ప్రస్తుతం ఒక ప్రముఖ నటుడు ప్రధాని మోదీ బయోపిక్ ని తీసే ఆలోచనలో ఉన్నారట. ఆయనెవరో కాదు. రేసుగుర్రం సినిమాలో విలన్ గా నటించి అందర్నీ మెప్పించిన రవికిషన్. అయితే ఈ సారి హిందీలో కాకుండా భోజ్‌పురి భాషలో తీయాలని ఉందని మనసులో మాట బయపెట్టాడు. నటుడు రవికిషన్ ఇటీవల బీజేపీలో చేరి గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే.


నేను కనీస వసతులు లేని గ్రామం నుండి వచ్చాను. కనీసం మరుగుదొడ్లు కూడా లేని గ్రామంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడేవారో నాకు తెలుసు. నా తల్లి, చెల్లి, ఇతరులు అనారోగ్యంతో బాధపడటం చూశాను. అలాంటి ఎన్నో సమస్యలను కళ్లారా చూశాను. కానీ బీజేపీ ప్రయత్నం వాటిని దూరం చేసేందుకు విశేష కృషి చేస్తున్నది. భారత్ మాతా కీ జై అనే నినాదం దేశవాసులందరినీ ఏకం చేస్తున్నది.


దేశంలోనే ఎన్నో సమస్యలకు మోదీ ప్రభుత్వం పరిష్కారం చూపుతున్నదని, 370 ఆర్టికల్ రద్దు సాహోసోపేతమైన నిర్ణయం అని అన్నారు. ప్రజా సేవ చేస్తూనే సినిమాలో నటిస్తాను. కానీ డ్యాన్స్, పాటలు తరహా పాత్రలు చేయకుండా సీరియస్ పాత్రలు చేస్తానని చెప్పారు. మోదీ, స్వామి వివేకానంద లాంటి ప్రముఖుల జీవితాలను భోజ్‌పురి భాషలో నిర్మించాలని అనుకొంటున్నాను అని తన మనసులో మాటని బయట పెట్టాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: