టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంటర్ అయిన నాని, ఆ తరువాత ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అష్టా చమ్మా సినిమాతో హీరోగా మారాడు. అయితే నటించిన తొలి చిత్రమే నానికి మంచి సక్సెస్ ని అందించి, ప్రేక్షకుల్లో నటుడిగా గుర్తింపు తీసుకువచ్చింది. ఇక ఆ తరువాత మెల్లగా అవకాశాలు దక్కించుకుని ముందుకు సాగిన నాని, తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని నాచురల్ స్టార్ అనే పేరు సంపాదించడం జరిగింది. ఇక ప్రస్తుతం ఆయన హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్ లీడర్ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. 

ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా సాంగ్స్ మరియు ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించడంతో పాటు సినిమాపై మరింతగా అంచనాలు పెంచాయనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకని నిన్న సాయంత్రం విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించింది సినిమా యూనిట్. అశేషంగా తరలివచ్చిన ఫ్యాన్స్ మధ్య జరిగిన ఈ వేడుకలో హీరో నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారాయి. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 11 ఏళ్ళు దాటింది, ఇన్నేళ్ళుగా తెలుగు ప్రజలు నా పై చూపిస్తున్న ప్రేమకు ఎంతో కృతజ్ఞతలు అంటూ నాని మాట్లాడారు. ఇక దర్శకుడు విక్రమ్ సహా ఈ సినిమాకు పని చేసిన ప్రతిఒక్కరు ఎంతో కష్టపడ్డారని, తప్పకుండా రేపు రిలీజ్ తరువాత సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు. 

ఇక ఈ సినిమాలో నెగటివ్ పాత్ర చేస్తున్న కార్తికేయ, తన అద్భుతమైన నటనతో జీవించాడని, అలానే తను సినిమాకు పనిచేసినన్ని రోజులూ ఎంతో శ్రద్దగా కష్టపడ్డాడని, తాను పని చేసిన విధానం చూస్తుంటే, రాబోయే మరికొద్ది రోజుల్లో పెద్ద హీరోగా మంచి ఉన్నత స్థానానికి ఎదుగుతాడని తనకు నమ్మకం ఉందని నాని తెలిపారు. అంతేకాదు, రాబోయే రోజుల్లో ఒకవేళ అవకాశం దొరికితే, కార్తికేయ హీరోగా నటించే సినిమాలో తాను విలన్ క్యారెక్టర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ సంచలన కామెంట్స్ చేసారు. ఇక గ్యాంగ్ లీడర్ తో పాటు సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కిస్తున్న వి అనే సినిమాలో నాని ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో నాని నెగటివ్ ఛాయలున్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం...!!


మరింత సమాచారం తెలుసుకోండి: