హీరో ఏ సినిమాకైనా కూడా ప్రధానబలం. సినిమాలో ఇంకెంతమంది టాప్ ఆర్టిస్టులు ఉన్నా కూడా హీరోకి ఉండే స్థాయి ఇంకో రేంజ్ లో ఉంటుంది. అలాగే ఏదైనా సినిమా బాక్స్ ఆఫీస్ బరిలో నిలవాలన్న , పడిపోవాలన్న కూడా హీరో క్యారెక్టర్ మీదే ఆధారపడి ఉంటుంది. ఆలా సినిమా మొత్తం తమ భుజాలపై మోసే హీరోలు ఇండస్ట్రీలో చాలా తక్కువమంది ఉంటారు. అలాంటివారిలో ఒకరు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా. పాత్ర ఏదైనా అలవోకగా జీవించేస్తారు ఆయుష్మాన్ ఖురానా. అందుకే ఆయన్ను ప్రతీ ప్రేక్షకుడు ఇష్టపడతాడు. అందుకే ఆయన నటించే సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకుంటూ ఉంటాయి. ఏ హీరో ధైర్యం చేయని సినిమాలను ఆయుష్మాన్ చేస్తుంటారు.

అదే ఆయన ప్రత్యేకత. ఇదే ఆయనకి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలోనే  జాతీయ అవార్డు వచ్చేలా చేసింది.అలాగే ఏ హీరోకైనా తమ కెరియర్ లో ఒక్కసారైనా కూడా  ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవాలని అనుకుంటారు. కానీ.. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా మాత్రం ఉత్తమ నటిగా అవార్డు కావాలని అంటున్నారు. హీరో ఏంటి ..ఉత్తమ నటి ఏంటి అని అనుకుంటున్నారా. ఆయుష్మాన్  ప్రధాన పాత్రలో నటిస్తు్న్న చిత్రం డ్రీమ్ గర్ల్. ఇందులో ఆయుష్మాన్ ఫోన్లలో పూజగా పేరు మార్చుకుని అమ్మాయి గొంతుతో మాట్లాడి వారిని ఫిదా చేస్తుంటాడు. దాంతో అందరూ ఆ వాయిస్‌కి పడిపోయి పెళ్లంటూ చేసుకుంటే పూజనే చేసుకుంటామని పట్టుబడతారు.

ఆలా కొద్దిరోజులు గడిచిపోయిన తరువాత  పూజ నిజమైన పూజ కాదు అని , ఓ మగాడని తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే సినిమా కథ.  ఈ సినిమాలో ఆయుష్మాన్ హీరోతో పాటు హీరోయిన్‌గాను నటించాడు. ఈ కారణంతోనే అందరూ ఉత్తమ నటుడు కావాలంటుంటే ..ఈయన మాత్రం  ఉత్తమ నటిగా అవార్డు కావాలని అంటున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన అంధాధున్ సినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు.

ఎలాగూ ఇప్పటికే ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకున్నాడు కాబట్టే , ఈసారి ఉత్తమ నటిగా కూడా అవార్డు తీసుకోవాలని అనుకుంటున్నాడు. కానీ , అది అసాధ్యం. దీనితో కనీసం  ఉత్తమ నటి కేటగిరీలో అయినా తన పేరు నామినేట్ అవ్వాలని ఆశపడుతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో నుష్రత్ బరూచా హీరోయిన్ గా నటిస్తుంది. రాజ్ శాండిల్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ప్రస్తుతం  ఆయుష్మాన్  ‘బాలా’, ‘గులాబో సితాబో’, శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్ అనే సినిమాలలో హీరో గా నటిస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: