సాధారణంగా వెండితెర నటులతో పోలిస్తే బుల్లితెర నటులు బాగా సంపాదిస్తుంటారు.ఇకపోతే డైలీ సీరియల్స్ లో నటించేవారైతే మరి ఎక్కువగా సొమ్ములు పోగేసుకుంటారు. అలా చాలా మంది అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. సినీ తారలకున్న పాపులారిటీ వీళ్ళ ముందు చాలా తక్కువనే చెప్పాలి. ముఖ్యనగ చెప్పాలంటే ఎప్పుడు టీవీలకు అతుక్కొని సీరియల్స్ చూసే ఆడవారైతే మరి వీళ్ళు రేపు ఎలా చేస్తారో అని తెగ భాద పడుతుంటారు కూడా. అంతగా వీరు ఫెమస్ అని వేరేలా చెప్పనక్కర్లేదు. నాన్ సింక్ కామెడీతో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 

సినిమాల విషయానికొస్తే.. ఏడాదికి ఒకటో. రెండో వస్తాయి.. కానీ సీరియల్స్ డైలీ సాగుతాయి.. ఎన్ని రోజులు  ఆడితే అన్ని రోజులు డబ్బులే డబ్బులు...అందుకేనేమో, చాలా మంది సినీ తారలకన్నా ఈ మాత్రం తగ్గని అందంగా ఉన్నా కూడా సినిమాలకు దూరంగా ఉంటారు. ఇక్కడే ఉండి సినిమా అవకాశాలు వస్తే చిన్న పాత్రల్లో చేసి వెండి తెరపై మేము చేయగలమని సత్తా చాటుతుంటారు. 

ఇది ఇలా ఉండగా బుల్లితెర నుండి వెండి తెరవరకు ఏ మాత్రం జోరు తగ్గకుండా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది నటి, యాంకర్ హరితేజ. సీరియల్స్ లోను, సినిమాలలో నటించిన ఈ బ్యూటీ బాగా సెటిల్ అయిందనే చెప్పాలి. రెమ్యునరేషన్ విషయం మాత్రం ఎప్పుడు వెనకడుగు వేయదు. అలా వెనకాల బాగానే పోగేసుకుంది కూడా. 

అసలు విషయానికొస్తే మొన్న కారు కొని అందరికి షాక్ ఇచ్చింది. ఆ షాక్ నుండి పూర్తిగా కోలుకోక ముందే మరొక షాక్ ఇచ్చింది. అదేనండి రిచ్ కారు కొన్న కొద్దిరోజులకే ఓ ఇంటిని కూడా కొన్నది. ఆ ఇల్లు లొకేషన్ అదిరిపోయేలా ఉంది. అన్ని సౌకర్యాలు అందుబాటులో కూడా ఉన్నాయట. ప్రస్తుతం ఆ కొత్త ఇంట్లో తన భర్తతో కలిసి గృహ ప్రవేశం చేసింది. ఆ పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కూడా. అవి ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: