నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కె కుమార్ డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా నానీస్ గ్యాంగ్ లీడర్. ఈ సినిమాలో హీరోయిన్ గా తమిళ అమ్మాయి ప్రియాంకా అరుల్ మోహన్ నటించారు. తెలుగులో ఇదే ఆమె తొలి సినిమా. సెప్టెంబర్ 13న గ్యాంగ్ లీడర్ రిలీజ్ అవుతుండగా మంగళవారం సాయంత్రం వైజాగ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.


ఎప్పటిలానే నాని తన ఫ్యాన్స్ తో చలాకీగా మాట్లాడాడు. 11 ఏళ్ల క్రితం అష్టా చమ్మ సినిమా టైంలో కూడా వైజాగ్ లోనే వచ్చి ఈవెంట్ చేశామని.. మళ్లీ 11 ఏళ్ల తర్వాత ఇక్కడ ఈవెంట్ చేస్తున్నామని అందుకే మళ్లీ 11 ఏళ్లు తాను సేఫ్ అన్నాడు నాని. ఇక ఈమధ్య తన సినిమాల్లో కొత్తవారిని పరిచయం చేయడం జరుగుతుందని.. ఈ సినిమాతో కూడా ప్రియాంకా అరుల్ మోహన్ ను పరిచయం చేస్తున్నారు.  


ప్రియాంకా గురించి నాని వైజాగ్ ఆడియెన్స్ ను అడుగుతూ పిల్ల బాగుందా.. వైజాగ్ వాళ్ల ఓట్లు పడినట్టేనా అంటూ నాని జోష్ ఫుల్ గా మాట్లాడాడు. తెలుగులో తొలి సినిమానే అయినా చాలా అద్భుతంగా నటించిందని అన్నాడు నాని. ఓ హీరోయిన్ ను పట్టుకుని పిల్ల పోరి అంటూ మాట్లాడి షాక్ ఇచ్చాడు నాని. 


విక్రం, నాని కాంబినేషన్ లో మొదటి సినిమాగా గ్యాంగ్ లీడర్ వచ్చింది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. సినిమాలోని అన్ని పాటలను అనంత్ శ్రీరాం రాయడం విశేషం. ఎన్నో భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా రిజల్ట్ మీద నాని ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. టీజర్, ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: