ప్రముఖ దర్శకుడు మారుతి సారధ్యంలో రూపొంది మంచి విజయం సాధించిన "భద్రమ్ బి కేర్ ఫుల్ బ్రదరూ"తో హీరోగా పరిచయమైన 'కత్తి లాంటి కుర్రోడు' రాజ్ దాసిరెడ్డి తాజాగా మరో సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.


"భద్రమ్ బి కేర్ ఫుల్ బ్రదరూ" అనంతరం ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న రాజ్ దాసిరెడ్డి.. మాతృభాషపై గల మక్కువతో త్వరలోనే మరో తెలుగు సినిమాకు శ్రీకారం చుట్టనున్నారు.


హీరో-హీరోయిన్ మినహా దాదాపుగా అందరూ కొత్తవాళ్ళతో రూపొందనున్న ఈ చిత్రం పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి!! 
ఇంజినీరింగ్ టాపర్,  న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ స్టూడెంట్ అయిన శ్రీరాజ్ దాసిరెడ్డి- తెలుగువాడి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించేందుకు సమాయత్తమవుతున్నాడు.హాలీవుడ్ లో 'రష్ అవర్, హెర్క్యులస్, ఎక్సమాన్ లాస్ట్ స్టాండ్' వంటి సంచలన చిత్రాలు తీసిన బ్రెట్ రాట్నర్ దర్శకత్వలో రూపొందే ప్రతిష్టాత్మక ఆంగ్ల చిత్రంలో శ్రీరాజ్ దాసిరెడ్డి నటించనున్నాడు. ఈ సినిమాలో నటించే అవకాశం రావడంపై ఉబ్బితబ్బిబ్బు అవుతున్న శ్రీరాజ్.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తెలుగువాడి సత్తా చాటుతానని వెళ్ళి అక్క‌డ న‌టించి తిరిగి తెలుగు భాష పైన ఉన్న మ‌క్కువ‌తో ఇక్క‌డ టాలీవుడ్‌లో తిరిగి సినిమా చెయ్య‌డానికి మ‌ళ్ళీ త్వ‌ర‌గా ముందుకు వ‌చ్చాడు. మరి ఈ సినిమాతోనైనా రాజ్ దాసిరెడ్డికి తెలుగులో మంచి హిట్ రావాలని ఆశిద్దాం. కొత్త హీరో చిన్న‌వాడైనా చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు. త‌న క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితం రావాల‌ని కోరుకుందాం. హాలీవుడ్‌లో చేసి తిరిగి టాలీవుడ్ కి రావ‌డం అంటే ఒక‌ర‌కంగా చెప్పాలంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఎంత ఇష్ట‌మున్నా కొంత‌మంది ఆర్టిస్టులు రావ‌డానికి ఆలోచిస్తారు. కానీ చిన్న వ‌య‌సులోనే ఇటు టాలీవుడ్ అటు హాలీవుడ్ రెండు ఇండ‌స్ట్రీల్లోనూ న‌టిస్తూ మంచి పేరు సంపాదించాల‌న్న త‌న  కోరిక నెర‌వాల‌ని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: