2. యాక్టర్ కమ్ డైరక్టర్ రవిబాబుది ఒక టిపికల్ స్టయిల్. తన మొదటి సినిమా అల్లరి దగ్గర్నుంచి ఈ టిపికల్ స్టైల్ నే ఫాలో అవుతున్నారు. కాస్త కొత్త కాన్సెప్ట్, చాలా తక్కువ బడ్జెట్, డిఫ్రెంట్ స్టైల్ పబ్లిసిటి, వెరైటి పోస్టర్...ఇలా తన మార్క్ ఐడియాలజి అంతా చాలా వినూత్నంగా ఉంటుంది. అంతేకాదు రవిబాబు తన సినిమాల ప్రచారానికి ఒక కాన్సెప్ట్ అనుకుంటారు. ఎవరు బావుందన్నా, బాలేదన్నా అలాగే ముందుకు వెళ్తారు. మొదటి సినిమా నుండి ఇప్పటిదాకా ఏ సినిమా అయినా అంతే. లేటెస్ట్ గా 'ఆవిరి' అనే సినిమా స్టార్ట్ చేసి, ఆల్ మోస్ట్ ఫినిష్ చేసారు. ఈ సినిమాకు ఆ మధ్య ఓ లుక్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నిర్మాత దిల్ రాజు చేతికి వచ్చిన సందర్భంగా మరో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

ఫస్ట్ పోస్టర్ లో ఓ గాజు జాడీ, అందులోంచి బయటకు వస్తున్న ఆవిరి లాంటి పొగ, జాడీలో డాన్స్ చేస్తున్న అమ్మాయి బొమ్మ. ఇప్పుడు రిలీజైన పోస్టర్ లో స్టవ్ మీద కుక్కర్. బయటకు వస్తున్న ఆవిరి, కుక్కర్ లో కనిపిస్తున్న కళ్లు. నిజంగా చూడటానికి ఈ పోస్టర్ చాలా కొత్తగా ఉంది. ఇలా ఆలోచించడం కేవలం మన రవిబాబు వల్లే సాధ్యమేమో. నిజానికి సినిమా మీద క్యూరియాసిటీ పెంచడానికి ఇలా చేయాలని రవిబాబు అనుకుని వుండొచ్చు. కానీ ఒకసారి కొత్త, రెండుసార్లు కొత్త. కానీ జనాలకు అలవాటు అయిపోయిన తరువాత మళ్లీ అయిడియా మార్చాలి. లేదంటే ప్రతి సినిమాకు రవిబాబు ఇలాగే చూపిస్తాడు తప్ప కొత్తదనం ఏముండదని నెగిటివ్ వే లో ఆలోచించే ఛాన్స్ ఉంది. 

దాంతో పాటు సినిమా మీద రావాల్సిన ఆసక్తిరాదు. కాన్సెప్ట్ మారిస్తే చాలదు. ప్రెజెంట్ చేసే విధానం కూడా మారాలి. లేదంటే ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ లో తన సినిమా ఎక్కడో కొట్టుకుపోతుంది. అసలే గత కొంతకాలంగా రవిబాబు సినిమాలేవి ఆడటం లేదు. ఇప్పటికే రవిబాబు అనే ఒక డైరెక్టర్ ఉన్నాడని చాలామంది మర్చిపోయారు కూడా. మరి చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా అంటే ఎంత ప్లానింగ్ ఉండాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: