మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా వాల్మీకి. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగుర్తండా రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ నెగటివ్ రోల్ లో నటించారు. సినిమాలో కోలీవుడ్ హీరో అధర్వ కూడా నటించడం విశేషం. సిద్ధార్థ్, బాబీ సింహా కలిసి నటించిన తమిల జిగుర్తండా తెలుగులో కొద్దిపాటి మార్పులు చేసుకుంది.    


ముఖ్యంగా నెగటివ్ రోల్ లో నటిస్తున్న వరుణ్ తేజ్ ఇరగదీసేశాడని తెలుస్తుంది. సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా పూజా హెగ్దె నటిస్తుంది. గణేష్ పాత్రలో వరుణ్ తేజ్ తన నట విశ్వరూపం చూపిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండగ సినిమాకు సంబందించిన మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి.  


హరీష్ శంకర్ ఈ సినిమా ను రెండు గంటల 51 నిమిషాలకు రన్ టైం ఫిక్స్ చేశారట. తమిళ సినిమా కూడా ఇంత లేదని తెలుస్తుంది. జిగుర్తండా కన్నడ రీమేక్ కూడా రన్ టైం తక్కువగానే ఉంది. కాని ఎటొచ్చి తెలుగులోనే ఏకంగా 9 నిమిషాల తక్కువ 3 గంటలు సినిమా ఉంటుందట. హరీష్ శంకర్ కామెడీ పల్స్ ఉన్న డైరక్టర్. అందుకే సినిమాలో అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఉంచారట.      


వరుణ్ తేజ్, పూజా హెగ్దె జంట సినిమాకు ప్లస్ అవుతుందని అంటున్నారు. సినిమాలో శోభన్ బాబు, శ్రీదేవిల ఆల్ టైం ఫేవరెట్ డ్యూయెట్ ఎల్లొవొచ్చి గొదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మ సాంగ్ రీమిక్స్ చేశారు. మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రాం ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. సెప్టెంబర్ 20న రిలీజ్ అవుతున్న వాల్మీకి ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: