శ్రీకాంత్ అడ్డాల దిల్ రాజు నిర్మించిన "కొత్త బంగారు లోకం" సినిమా ద్వారా దర్శకుడిగా తెలుగు తెరకు పరిచమయ్యాడు. వరుణ్ సందేశ్ మరియు శ్వేత బసు ప్రసాద్ లు జంటగా నటించిన ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా తరువాత దాదాపు మూడు సంవత్సరాలు కష్టపడి  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు స్ర్కిప్ట్ రెడీ చేశాడు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు విక్టరి వెంకటేష్ లు హీరోలుగా నటించారు. ఈ సినిమా చాలా రోజుల తరువాత తెలుగులో వచ్చిన మల్టీస్టారర్ కావడంతో మంచి హైప్ వచ్చింది.


భారీ తారగణంతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.ఆ సినిమా తరువాత వరుణ్ తేజ్ ను తెలుగు తెరకు పరిచయం చేస్తూ "ముకుందా" సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా బాగానే ఆడింది. ఈ సినిమా తరువాత మహేష బాబు సమంత కాజల్ అగర్వాల్  ప్రధాన తారగణంగా  బ్రహ్మోత్సవం సినిమా కు దర్శకత్వం వహించాడు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం అయ్యింది. దీంతో ఆయన కష్టాలు మొదలైయ్యాయి.ఈ సినిమా నిర్మాత పీవీపీ దర్శకుడు శ్రీకాంత్ సినిమా స్క్రిప్ట్ లేకుండా షూట్ంగ్ మొదలు పెట్టాడని. ఇది చాలా మంది డిస్రీబ్యూటర్ల డబ్బు స్క్రిప్ట్ లేకుండా సినిమా మొదలు పెట్టవద్దు  అని నేను చెప్పిన వినలేదు . ఈ సినిమా వల్ల చాలా  డబ్బును పోగొట్టుకున్నాను అని ఒక ఇంటర్వ్యూలో తన ఆవేధన వ్యక్తపరిచారు.


ప్రస్తుతం "కూచిపూడి వారి విధి" అనే స్ర్కిప్ట్ ని రెడీ చేశాడు. గత సంవత్సర కాలంగా ఈ సినిమాకి హీరోను వెతుకుతున్నాడు. ఈ స్టోరీని నాని మరియు శర్వానంద్ లకు వినిపించాడు కానీ వారు నో చెప్పారు. రీసెంట్ గా రామ్ పోతినేని కి వినిపించాడు. రామ్ కూడా ఈ  స్ర్కిప్ట్ ని తిరస్కరించాడని ఫిల్మ్ నగర్ టాక్.ఈ సినిమాకి నిర్మాతలు రెడీగాఉన్నారు కానీ హీరో దొరకడం కష్టంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: