ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్ సెల‌బ్రిటీలు ఎక్కువుగా సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్స్‌ను తెగ ఫాలో అవుతున్నారు. ఒక్క హీరోలు మాత్రమే సోషియ‌ల్‌ నెట్‌వ‌ర్కింగ్ సైట్స్‌ను హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్స్‌,డైరెక్టర్స్,ప్రొడ్యూజ‌ర్స్ ఇలా అంద‌రూ సోషియ‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్స్‌కి అడిక్ట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే లేటెస్ట్‌గా హీరో నితిన్ త‌న ట్విట్టర్ అకౌంట్‌ను డిలీట్ చేశాడు. కొద్ది రోజుల క్రితం నితిన్ ట్విట్టర్ ఎకౌంట్‌ను ఎవ‌రో హ్యాక్ చేశారు. అందుకే కొంత కాలంగా నితిన్ త‌న ట్విట్టర్ ఎకౌంట్‌ను ఉప‌యోగించ‌డంలేదు. ఇప్పుడు త‌న ట్విట్టర్ అకౌంట్‌ను తొల‌గిస్తున్నానంటూ, త్వర‌లోనే మ‌ళ్ళీ వ‌స్తాను అంటూ చెప్పాడు. టాలీవుడ్ హీరోల‌లో ట్విట్టర్ ద్వార‌ అభిమానుల‌కు మెసేజ్ పంపే వారిలో నితిన్ కూడ ఒక‌రు. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు సంబంధించిన ఏదైన పెద్ద విష‌యాన్ని ముందుగా నితినే, త‌న ట్విట్టర్ ద్వార తెలియ‌ప‌రుస్తారు. అలాంటిది నితిన్ ట్విట్టర్ నుండి తొల‌గిపోవ‌డంతో ఇత‌ర సెల‌బ్రిటీలు వాళ్ళ అకౌంట్స్ సెక్యూరిటి గురించి జాగ్రత్త ప‌డుతున్నారు. ప్రస్తుతం నితిన్ కొరియ‌ర్ బాయ్ క‌ళ్యాణ్‌, హార్ట్ఎటాక్ మూవీల‌ షెడ్యూల్స్‌లో బిజిబిజిగా ఉన్నాడు. త్వర‌లోనే హార్ట్ఎటాక్ మూవీకు సంబంధించిన డ‌బ్బింగ్ ప‌నులు కూడ స్టార్ట్ కాబోతున్నాయి. నితిన్ సైతం సంవ‌త్సరంలో క‌నీసం మూడు మూవీలను రిలీజ్ చేసుకునే విధంగా ప్లానింగ్ చేసుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: