మహేష్ బాబు కెరీర్లో బెస్ట్ సినిమాల్లో తప్పకుండా ఉండే సినిమా మురారి.  క్లీన్ ఫ్యామిలీ సినిమాగా తెరకెక్కింది.  కృష్ణవంశి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రతి చోట బంపర్ హిట్ టాక్ తెచ్చుకొని విజయం సాధించింది.  ఫ్యామిలీ ఆడియన్స్ చక్కగా కూర్చొని చూడదగ్గ సినిమా ఇది.  చాలా సింపుల్ పాయింట్ చుట్టూ సినిమా నడుస్తుంది.  ఉమ్మడి కుటుంబం.. వారి మధ్య ఉండే సంబంధాలు వంటి వాటిని చక్కగా చూపించారు.  


ఇప్పటికి ఈ సినిమా టీవీలో వస్తుంది అంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూస్తుంటారు.  ఇందులో సోనాలి బింద్రే హీరోయిన్ గా చేసింది.  సోనాలి ఈ సినిమాతో మంచి విజయం సాధించింది.  ఆమె తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ మంచి విజయాలు సాధించాయి.  అందులో మురారి కూడా ఒకటి. మణిశర్మ సినిమాకు అందించిన మ్యూజిక్ సూపర్.  నిన్నేపెళ్ళాడుతా తరువాత అలాంటి క్లీన్ ఫ్యామిలీ సినిమా మురారి.  


మహేష్ బాబు హీరోగా వందశాతం న్యాయం చేశారు.  అమాయకంగా కనిపిస్తూనే.. నటనతో అదరగొట్టాడు మహేష్.  రవిబాబు బాగుంటుంది.  ఇదిలా ఉంటె, ఈ సినిమాలో బంగారు కళ్ళ బుచ్చమ్మో అనే సాంగ్ ఉన్నది కదా.  ఆ సాంగ్ సమయంలో మహేష్ టాప్ లెస్ కారులో సొనాలికి కూర్చోపెట్టుకొని డ్రైవ్ చేస్తుంటాడు.  సోనాలి పదహారణాల తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది.  లంగా ఓణిలో అదిరిపోయింది.  మహేష్ బాబు లైట్ కలర్ గోధుమ రంగు ఫాంట్, బ్లూ కలర్ ప్రింటెడ్ షర్ట్ చేసుకుంటారు.  


పాపం మహేష్ బాబుకు అలాంటి షర్ట్ లు వేసుకోవడం కొత్త.  ప్రింటెడ్ షర్ట్ తో కాస్త ఇబ్బంది పడ్డాడు.  మహేష్ ఇబ్బందిని గమనించిన సోనాలి  నవ్వుకుంటుంది.  అదే సమయంలో ఆ స్పాట్ లో ఉన్న దర్శకుడు కృష్ణవంశీ కూడా నవ్వుతూ కనిపించాడు.  మహేష్ బాబు మాత్రం షర్ట్ తో ఇబ్బంది పడుతూనే సాంగ్ చేశాడు.  ఆ సినిమాలో తప్పించి మరే సినిమాలో కూడా మహేష్ అలాంటి గందరగోళంగా ఉండే షర్ట్స్ వేసుకోలేదు.  పోకిరిలాంటి సినిమాలో కూడా ట్రెండీ గా ఉన్న షర్ట్ ను వేసుకున్నారుగాని, డార్క్ కలర్ ప్రింటెడ్ షర్ట్స్ మాత్రం యూజ్ చేయలేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: