ప్రస్తుతం టాలీవుడ్ లో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హవా  నడుస్తుంది అంటే అతిశయోక్తి కాదు . చలో మూవీ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి  హిట్టు కొట్టిన ఈ అమ్మడు ... గీత గోవిందం తో తన ఫాల్లోవింగ్ ఓ రేంజ్ లో పెంచుకుంది . విజయ్ రష్మిక కెమిస్ట్రీకీ అందరు ఫిదా అయ్యారు కూడా . దీంతో ఆమె రేంజ్ మారిపోవటం తో స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేస్తుంది ఈ బ్యూటీ . అయితే రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ పక్కన ఛాన్స్ కొట్టేసి సరిలేరు నీకెవ్వరులో నటిస్తుంది .తెలుగు తో వరుస సినిమాలతో బిజీ గా ఉన్న ఈ అమ్మడు కి ... వివిధ భాషల్లో నటించేందుకు అవకాశాలు వస్తున్నాయి .


ఇప్పటికే తమిళ దర్శకుడు భాగ్యరాజ్‌కన్నన్ తెరకెక్కిస్తున్న సుల్తాన్ సినిమా తో తమిళ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపొయింది . రష్మిక ఫాలోవింగ్ బాలీవుడ్ వరకు పాకడంతో అక్కడ అవకాశాలు వస్తున్నాయని వార్తలు వెలువడగా ... అక్కడ కూడా రష్మిక ఎంట్రీ కి బెర్త్  కన్ఫర్మ్ అయినట్టే కనిపిస్తుంది .రీసెంట్ గా నాని నటించిన జెర్సీ ని బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట . ఈ నేపథ్యంలో శ్రద్ధ శ్రీనాథ్ పాత్రలో రష్మిక నటించ బోతుందట .రీసెంట్గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న షాహిద్ కపూర్ ఈ సినిమాలో నాని  పాత్రలో నటించ బోతున్నాడు .కాగా ఈ సినిమా రీమేక్ ని అల్లుఅరవింద్, దిల్ రాజు,సితార ఎంటర్టైన్మెంట్ కరణ్‌ జోహార్‌తో కలిసి  నిర్మిస్తుండగా ..గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు . ఈ సినిమాలో ఉన్న డెప్త్, ఫీల్ బాలీవుడ్ ప్రేక్షకులకు కనెక్ట్ అవకాశం ఉండటం తో ఈ సినిమా హిట్ అవుతుందని భావిస్తున్నారట . ఇప్పటికే కన్నడ, తెలుగు ఇండస్ట్రీ లలో ఫుల్ క్రజ్ సంపాదించి దూసుకు పోతున్న రష్మిక ... బాలీవుడ్ లో కూడా తన హావా కొనసాగిస్తుందా చూడాలి మరి  


మరింత సమాచారం తెలుసుకోండి: