తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముప్పై నలభై ఏళ్ళ క్రితం ఒక కమర్షియల్ డైరెక్టర్ కి ఒకటో రెండో ఫ్లాప్స్ వస్తే అదంత పెద్ద సమస్య అయ్యోది కాదు. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్. కృష్ణ, చిరంజీవి లాటి స్టార్ హీరోలు ఆఫర్స్ ఇచ్చే విషయంలో ఆలోచించేవారు కాదు. దాసరి నారాయణ రావు, రాఘవేంద్ర రావు, కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ లాంటి అగ్ర దర్శకులు వందల సినిమాలు చేశారంటే ఇదే ముఖ్య కారణం. కానీ ప్రస్తుతం మన ఇండస్ట్రీలో ఆ పరిస్థితి లేదు. ఒక్క డిజాస్టర్ జూనియర్ సీనియర్ అనే తేడా లేకుండా డైరెక్టర్ల కెరీర్ ను తలకిందులు చేసేస్తోంది. అందుకు ఉదాహరణగా వి.వి.వినాయక్, బోయపాటి శ్రీను, శ్రీకాంత్ అడ్డాల, బొమ్మరిల్లు భాస్కర్, వి.ఎన్.ఆదిత్య ఇలా చెప్పుకుంటు పోతే లిస్ట్ చాలా పెద్దగానే తయారవుతుంది.

ఒక సినిమా డిజాస్టర్ ప్రభావం నుంచి బయటపడటం అంత ఈజీ అనిపించడం లేదు. కొందరైతే డైరెక్షన్ కు దండం పెట్టేసి నటులుగా కూడా మారిపోతున్నారు. వి.వి. వినాయక్ మీద ఇలాంటి కామెంట్సే ఉన్నాయి. ఇంటెలిజెంట్ రిజల్ట్ దెబ్బకు ఆయన కొంత గ్యాప్ తీసుకుని ఫుల్ లెన్త్ రోల్ లో తనే హీరోగా వేరే దర్శకుడి సినిమా ద్వారా నటుడిగా పరిచయమవుతున్నారు. డైరెక్టర్ గా ఆఫర్స్ ఉన్నప్పటికీ ఎందుకో తరుణ్ భాస్కర్ కూడా యాక్టింగ్ మీద ఫోకస్ పెడుతున్నాడు. కెప్టెన్ కుర్చీ అంటే భయపడుతున్నారు..కొత్త దర్శకులకైతే చమటలు పడుతున్నాయి. 

ఇక బోయపాటి శీను మీద వినయ విధేయ రామ ఇచ్చిన ఎఫెక్ట్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్ చరణ్ ఈ సినిమా ఎఫెక్ట్ కి లిఖిత పూర్వకంగా సారీ చెప్పాడు. ఆ తర్వాత బాలకృష్ణతో బోయపాటి ప్లాన్ చేసుకున్న భారీ సినిమా పెండింగ్ లో పడిపోయింది. ఒకవేళ వినయ విధేయ రామ్ బ్లాక్ బస్టర్ అయ్యుంటే బాలయ్య-బోయపాటి సినిమా ఖచ్చితంగా స్టార్ట్ అయ్యోది. కానీ బోయపాటిని వద్దని.. బాలయ్య కెఎస్ రవికుమార్ తో కమిటయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తుంటే ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతోంది. ఒకప్పుడు అభిమానించిన దర్శకులే అయినా తమను మెప్పించేలా సినిమా తీయలేకపోతే నిర్మొహమాటంగా రిజెక్ట్ చేస్తున్నారు. ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: