యంగ్ హీరో నితిన్ సెకండ్ ఇన్నింగ్స్ సాఫి గా సాగిపోతుంది. ప్రస్తుతం నితిన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.  ఆయన నటించిన చివరి మూడు సినిమాలు సరిగా ఆడలేదు. చివరగా నితిన్ సమంత తో నటించిన "అ ఆ" సినిమా హిట్ అయ్యింది. "అ ఆ" కు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. .

ప్రస్తుతం నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో "భీష్మ" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.భీష్మ సినిమా పై మొదటి నుండి అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమా నుండి బయటికి వచ్చే ప్రతీ అప్డేట్ సినిమా పై హైప్ ని ఇంకా పెంచుతున్నాయి. దర్శకుడు వెంకీ కుడుముల  భీష్మ సినిమాను రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.


వెంకీ కుడుముల కి కామెడీ మీద మంచి పట్టు ఉంది. ఆయన మెదటి సినిమా "ఛాలో" లో కామెడీ చాలా బాగా వర్క అవుట్ అయ్యింది. ఈ సినిమాలో కూడా మంచి కామెడీ ట్రాక్ ఉందని వార్తలు వస్తున్నాయి. భీష్మ సినిమాలో వెన్నెల కిషోర్ పరిమాళ అనే క్యారెక్టర్ లో కనిపించానున్నాడు.నితిన్ మరియు వెన్నెల కిషోర్ లు కామెడీ ని చాలా బాగా పండిస్తారు. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్  సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని ఫిల్మ్ నగర్ టాక్.
 
భీష్మ లో కుమారి 21ఎఫ్ బ్యూటీ హెబ్బా పటేల్ పవర్ ఫుల్ నెగిటివ్ రోల్ లో కనిపించనుంది.రొమాంటిక్ మూవీలో లేడి విలన్ అంటేనే సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా తరువాత నితిన్ హీరో గా దర్శకుడు ఏలేటి సినిమా మొదలవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: