మెగాస్టార్ చిరంజీవి,డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ‘సైరా నరసింహారెడ్డి’ఈ సినిమా స్టార్ట్ అయినప్పటినుండి ప్రేక్షకుల నోళ్లల్లో నానుతుంది. ఇక అభిమానులైతే పూనకంవచ్చినట్లు ఊగిపోతున్నారు.ఇక సాహో మూవీ ప్రభావం సైరా పై పడుతుందని ప్రచారం జరిగిన, అలాంటిదేమిలేదని తప్పక ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుని హిట్ కొట్టడం ఖాయమనే ధీమాలోఉన్నారు చిత్రయూనిట్.ఇకపోతే ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని చిరుతనయుడు రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ బ్యానర్‌‌పై దాదాపు 250 కోట్లకు పైగా భారీబడ్జెట్‌తో నిర్మించారు.



చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా,అమితాబ్ బచ్చన్,విజయ్ సేతుపతి,కిచ్చ సుదీప్,జగపతి బాబు,ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ,తమిళం,కన్నడ మలయాళ భాషల్లో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే'సైరా'మూవీ యూఎస్ఎలో కూడా భారీగా విడుదల కాబోతోంది.ఇదివరకు రిలీజైన ఖైదీ నెంబర్ 150,అజ్ఞాతవాసి,స్పైడర్,గీత గోవిందం.వంటి సినిమాలన్నీ మంగళవారం అమెరికాలో ప్రీమియర్ల ద్వారా విడుదలయ్యాయి.వీటిలో పవన్,మహేశ్ సినిమాలకు డివైడ్ టాక్ వచ్చినా, ఓవర్సీస్ కలెక్షన్లలో దుమ్మురేపాయి.అజ్ఞాతవాసి సినిమా అయితే ఏకంగా 2 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది.



స్పైడర్ కూడా మొదటి రోజే ఒక మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది.ఖైదీ నెంబర్ 150 సినిమాకు 2.45 మిలియన్ డాలర్ల కలెక్షన్లను చేరుకోగా..ప్రీమియర్ల ద్వారానే ఒక మిలియన్ డాలర్ మార్కును చేరుకుంది.అందుకే పెద్ద సినిమాలను సరిగ్గా మంగళవారం విడుదలయ్యేట్లు నిర్మాతలు ప్లాన్ చేస్తుంటారు.ఇప్పుడు చిరంజీవి సైరా నరసింహారెడ్డి కూడా అమెరికాలో మంగళ వారమే విడుదలవబోతోంది.ఇప్పటికే దీనికి సంబంధించిన బిజినెస్ జరిగిపోయినట్లు సమాచారం. భారత్‌లో ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల అవుతుంది.అంటే అమెరికాలో అక్టోబర్ 1నే ప్రీమియర్ షోలు ఉంటాయి.అక్టోబర్ 1న మంగళవారం కావడం, అమెరికాలో సైరా సినిమాకు కాస్త అడ్వాంటేజ్‌గా మారనుంది. అమెరికాలో ప్రతి మంగళవారం పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లు,యాప్స్‌ ప్రత్యేక ఆఫర్లను ఇస్తుంటాయి.మరి ఈ ఆఫర్లతో నైనా సాహో ను మరపించి సైరా విజయవంతంగా దూసుకెళ్తూ ఎంతవరకు కలెక్షన్లు,ఏ రేంజ్‌లో రాబడుతుందో వేచి చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: