నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "గ్యాంగ్ లీడర్". ఇప్పటికే యూఎస్ ప్రీమియర్స్ ద్వారా అందిన సమాచారం ప్రకారం గ్యాంగ్ లీడర్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది. నిన్నటి వరకు చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్న నాని కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో ఓ ఫన్నీ పోస్ట్ చేయడం ద్వారా తన ఫ్యాన్స్ కి చిన్న విన్నపం చేశారు.


తన గ్యాంగ్ లో సభ్యురాలైన  లక్ష్మీ భుజం పై వాలి నిద్ర పోతున్న ఫోటో పెట్టి,”గ్యాంగ్ లీడర్ హిట్ ఐతే లేపండి, లేకుంటే డిస్ట్రబ్ చెయ్యొద్దు, గ్యాంగ్ లీడర్ మీ మూవీ, మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను, మీ పెన్సిల్ పార్థసారథి” అని ట్విట్టర్ సందేశం ఇచ్చారు. ఇక సినిమా చూసిన ప్రేక్షకుల టాక్ చూస్తే.. సినిమా అంత కూడా చాల డీసెంట్‌గా ఉందని,ఎక్కడా ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా దర్శకుడు విక్రమ్ చాలా ఫ్లాట్‌గా సినిమాను తెరకెక్కించారని, గత చిత్రాలన్నింటిలో ఇదే అత్యంత సులభమైన చిత్రమని అంటున్నారు.


ఫస్టాఫ్ అంత కూడా కామెడీతో ఎక్కడ బోర్ అనిపించలేదని.. అయితే, సెకండాఫ్ అంత గొప్పగా లేదని కొంత మంది అంటున్నారు. కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా ఉన్నాయని పెదవి విరుస్తున్నారు. దర్శకుడు సెకండాఫ్‌పై మరింత దృష్టి పెట్టుంటే బాగుండేది అని అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే సినిమా యావరేజ్‌గా ఉందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.


విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని హాస్యంతో సాగే ఎమోషనల్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కించాడని తెలుస్తుంది. నాని తో కూడిన ఐదుగురు ఆడవాళ్ల సాహసాల సమాహారమే గ్యాంగ్ లీడర్. యంగ్ హీరో కార్తికేయ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించగా, ప్రియాంక అరుళ్ మోహన్ నాని సరసన హీరోయిన్ గా నటించింది. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: