ఒకప్పుడు వివిధ విభాగాల్లో పని చేసిన సీనియర్స్ అందరు ... సెకాంగ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయటానికి సిద్ధమవుతున్నారు . మొన్నటి వరకు సినిమాలకి దూరంగా ఉన్న విజయశాంతి తాజాగా ఆమె సెకెండ్ ఇన్నింగ్స్  స్టార్ట్ చేయగా ...ఇప్పుడు మరొకరు సెకండ్ ఇన్నింగ్స్ లోకి అడుగు పెట్టారు . అయన ఎవరో కాదు ...స్వరాలా మాంత్రికుడు కోటి . ఒక దశాబ్దం పాటు తన సుస్వరాలతో శ్రోతులను అలరించిన సంగీత దర్శకుడు కోటి ...ఆ తర్వాత వివిధ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ చేపడుతూ ..ఎంతో మంది యువ గాయకులను ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు .


అయితే తాజాగా కోటి అవతారం చూస్తే అయన కూడా సెకాంగ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్టే అనిపిస్తుంది . ఇప్పటి వరకు తన స్వర మాధుర్యం తో ఉర్రుతలూగించిన కోటి..ఇప్పుడు నటనలో ను తన సత్తా చాటాలని నిర్ణయించుకున్నట్టున్నాడు . వెండితెరపై సందడి చేయటానికి రెడీ అయ్యాడు. దర్శకుడు శివ నాగేశ్వరావు  తెరకెక్కిస్తున్న "దేవినేని" సినిమాలో కోటి నటిస్తున్నాడు . ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ..స్వరాల మాంత్రికుడు కోటి ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు . ఈ సినిమా లో కోటి పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల  చేయగా మంచి రెస్పాన్స్ వచ్చినట్టు  చిత్ర బృందం తెలిపింది . 


  
కాగా ఈ సినిమాలో దేవినేని నెహ్రూగా ప్రధాన పాత్రలో నందమూరి తారకరత్న నటిస్తుండగా ,  చలసాని వెంకట రత్నం పాత్రలో తుమ్మల ప్రసన్నకుమార్,  వంగవీటి రంగాగా సురేష్ కొండేటి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తియినట్టే అని చిత్రబృందం తెలిపింది . కాగా ఇప్పటికే పలు ప్రయోగాలు చేసినప్పటికీ తారక రత్నకి సరైన హిట్టు దక్కలేదు .ఈ సినిమా హిట్ అవ్వటం తారకరత్న కెరీర్ కి చాలా ముఖ్యం. కాగా ఇప్పటి వరకు తన స్వరాలతో మాయ చేసి సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న కోటి ...తన సెకండ్  ఇన్నింగ్స్ లో ఎంత సక్సెస్ అవుతాడో చూడాలి మరి 


మరింత సమాచారం తెలుసుకోండి: